Tuesday, January 21, 2025

లాస్యనందిత మృతిపై సిఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ ఎమ్మెల్యే నందిత లాస్య అకాల మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్యనందిత మృతి బాధకలిగించిందని సిఎం అన్నారు. నందిత కుటుంబసభ్యులకు సిఎం రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సిఎం తెలిపారు. గతేడాది ఇదే నెలలో నందిత తండ్రి స్వర్గస్తులయ్యారు. ఈ ఏడాది ఇదే నెలలో నందిత మృతి అత్యంత విచారకరం అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News