Sunday, December 22, 2024

సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరపించాలని చూస్తున్నారు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్‌వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ 

మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను మరపించాలని చూస్తున్నారని బిఆర్‌ఎస్‌వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. గతంలో కెసిఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకొనే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. స్టాఫ్ నర్స్, కానిస్టేబుల్, గురుకులాల్లో ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇస్తే, తాము ఇచ్చినట్టు బిల్డప్ కొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో శనివారం మాజీ ఎఫ్‌డిసి చైర్మన్ అనిల్ కూర్మాచలంతో కలిసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.

నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది ఉండకూడదని రోడ్డు డెవలప్‌మెంట్ ప్లానింగ్‌లో భాగంగా జూబ్లీ బస్టాండ్ నుంచి షామీరీపేట్ వరకు స్కై ఎలివేటర్ కారిడర్ ఏర్పాటు చేయాలని ఉద్దేశ్యంతో ఆనాడు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలసి అప్పటి సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ విజ్జప్తి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఆనాడు కెసిఆర్,కెటిఆర్‌లు అహార్నశలు కృషి చేశారని పేర్కొన్నారు. ఆర్మీ అధికారులు అధీనంలో భూములు ఉంటే ఆర్మీ అధికారులకు దీని కోసం వికారాబాద్‌లో భూములు  ఇచ్చారని, అప్పుడు ఆర్మీ అధికారులు కూడా ఒప్పుకున్నారని చెప్పారు. సిఎం రేవంత్ రెడ్డి మల్కాజీగిరి ఎంపిగా ఉండి కూడా కారిడార్‌కి సంబంధించిన భూముల గురించి ఎప్పుడు మాట్లాడలేదని విమర్శించారు. కొత్త ప్రాజెక్ట్‌లను తీసుకొచ్చి మీరు చేసినట్లు చెప్పుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సిఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పైన దృష్టి పెట్టాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News