Friday, January 3, 2025

యువతకు నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక వర్సిటీలు: సీఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

యువతకు నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక వర్సిటీలు ఏర్పాటు చేస్తామని.. ఉపాది అవకాశాలను మెరుగుపరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన పారిశ్రామికవేత్తలతో యువతకు శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి క్యాంపస్ ఎంపికలతో ఉద్యోగం కల్పిస్తామని.. ఆయా దేశాలకు అవసరమైన మ్యాన్ పవర్ ను ప్రభుత్వం ద్వారా అందిస్తామని తెలిపారు.

విదేశాలకు వెళ్లే వారికి ఓరియెంటేషన్ ఇప్పిస్తామన్నారు. వంద పడకల ఆస్పత్రి ఉన్న ప్రతి చోట నర్సింగ కళాశాల ఉంటుందన్నారు. పాత సీఎం క్యాపు కార్యాలయాన్ని రాష్ట్ర అతిథి గృహంగా మారుస్తామని చెప్పారు. త్వరలో ప్రెస్ అకాడమీ చైర్మన్ నియమిస్తామని.. ఆ తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం పాటిస్తున్నామని.. శాఖకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమిస్తామని తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులిస్తామని సీఎం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News