Monday, January 20, 2025

ఆ తర్వాతే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచన చేశారు. కేబినెట్‌ సబ్‌ కమిటీ సూచనల ఆధారంగా మందుకెళ్లాలని సీఎం ఆదేశించారు. 60 రోజుల్లో ఏకసభ్య కమిషన్‌ నివేదిక సమర్పించాలని చెప్పారు.

ఏకసభ్య కమిషన్‌ నివేదిక సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని సిఎం రేవంత్ నిర్ణయించారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. 24 గంటల్లో కమిషన్‌కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News