Friday, November 22, 2024

ముఖ్యమంత్రి పర్యటన ఖరారు

- Advertisement -
- Advertisement -

ఈ నెల 11న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. ఇందిరమ్మ ఇళ్ల పథక ప్రారంభం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ప్రియాంక అల, ఐటీడీఏ పీవో ప్రతిక్ జైన్, ఎస్పీ రోహిత్ జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర క్యాబినెట్ మంత్రులతో కలిసి భద్రాచలం పర్యటించనున్నారని తెలిపారు.

ఉదయం ముందుగా సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని, మిథిలా స్టేడియంలో ఏర్పాటుచేసిన జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొంటారని, తదుపరి, అక్కడే ఏర్పాటు చేసిన సభలో మూడు వేలమంది ప్రజల సమక్షంలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభిస్తారని, తదుపరి భోజన అనంతరం, మణుగూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారనితెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీతో మాట్లాడుతూ… హెలిపాడ్ ఏర్పాట్లు, భద్రత ఏర్పాట్లు, క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. హేలిపాడ్ వద్ద అంబులెన్స్, డాక్టర్లు, ఫైర్ ఇంజన్, మొదలగు అత్యవసర ఏర్పాట్లుచేయాలన్నారు. ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ తో మాట్లాడుతూ… కళ్యాణ మండపం వద్ద ఎలక్ట్రికల్,జనరేటర్, ఏసీల ఏర్పాటు వాహనాల పార్కింగ్ కొరకు వసతి ఏర్పాట్లు పర్యవేక్షించలన్నారు. ముఖ్యమంత్రి దైవదర్శనం, సమీక్షా సమావేశం, ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవానికి వచ్చే ప్రజలకు సిట్టింగ్ అరేంజ్మెంట్, మంచి నీటి వసతి, పరిశుద్ధ శాఖాహార భోజన ఏర్పాట్లు చేయవలసిందిగా భద్రాచలం ఆర్డీవోను ఆదేశించారు.

సీతమ్మ సాగర్ ప్రాజెక్టుపై జరిగిన, జరగవలసిన పనులు పూర్తి నివేదిక సిద్ధం చేసుకోవాలని ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు. బార్కేడింగ్ ఏర్పాట్లు, హెలిపాడ్ ఏర్పాట్లు, కుర్చీలు ఏర్పాట్లు, మణుగూరులో జరిగే బహిరంగ సభ, ఏర్పాట్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వర్లు ను ఆదేశించారు. భద్రాచలం దేవస్థానం అభివృద్ధి పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేసుకోవాలని దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవిని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం డిఆర్ఓ రవీంద్రనాథ్ ను అన్ని ఏర్పాట్లపై పర్యవేక్షించవలసిందిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఆదేశించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ రవీంద్రనాథ్, డి ఆర్ డి ఓ విద్యాచందన, జిల్లా పరిపాలన అధికారి గన్య, డి ఎం హెచ్ ఓ శిరీష, డీఎస్ఓ రుక్మిణి, భద్రాచలం ఆర్టీవో కే దామోదర్ రావు, కొత్తగూడెం ఆర్డీవో మధు, ఆర్ అండ్ బి ఈఈ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాసరావు , ఎక్సైజ్ సూపర్డెంట్ జానయ్య, ఇరిగేషన్ ఈఈ అర్జున్ , మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News