Monday, December 23, 2024

ఐటిఐలు.. ఇక ఎటిసిలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సాంకేతిక నైపుణ్యం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల కో సం ఎదురు చూడాల్సిన అవసరం లేదని సిఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. 65 ఐటీఐలను ఏటిసిలుగా అప్‌గ్రేడ్ చేస్తూ మల్లేపల్లి ఐటీఐలో మంగళవారం అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్‌కు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలప్‌మెంట్ కోసమే ఐటీఐలను ఏటిసిలుగా మారుస్తున్నామన్నారు. రూ. 50 కోట్లతో మల్లేపల్లిలో ఏటిసిని నిర్మిస్తున్నామని సిఎం తెలిపారు.త్వరలో రాష్ట్రం లో నలుమూలలా ఏటిసిలను ఏర్పా టు చే స్తామన్నారు. నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి నైపుణ్యం అందిస్తామన్నారు. నిరుద్యోగులకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పిస్తామని ఆయన చెప్పారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ అన్నారు. ప దేళ్లుగా ఐటీఐలు నిరుపయోగంగా మారాయని సి ఎం రేవంత్ పేర్కొన్నారు. యువతకు నైపుణ్యాన్ని అందిస్తే ప్రపంచంతో పోటీ పడతారన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉద్యోగ అవకాశాలకు దారి చూపెడుతుందన్నారు.

క్రూట్‌మెంట్ బోర్డుల చుట్టూ..
40 లక్షల మంది యువతీ, యువకులు ఉపాధి లే క రిక్రూట్‌మెంట్ బోర్డుల చుట్టూ తిరుగుతున్నార ని, సర్టిఫికెట్లు జీవన ప్రమాణాలను పెంచవని ప్రపంచంతో పోటీపడాలంటే సర్టిఫికెట్లతో పాటు సాంకేతికత అవసరమని సిఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు విద్య, నిరుద్యోగుల కు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రోబోలు మొదలుకుని ఆధునిక యం త్రాలు తీసుకొచ్చి యువతకు శిక్షణ అందించాలని భావిస్తున్నామని సిఎం రేవంత్ అన్నారు. తాము పాలకులం కాదు, సేవకులమని సిఎం అన్నారు.

టాటా సంస్థ సహకారం తో రూ. 2,324 కోట్లతో 64 ఐటిఐలను ఏటిసిలుగా మారుస్తున్నామని సి ఎం రేవంత్ చెప్పారు. సాంకేతికతను అందించడానికి ముందుకొచ్చిన టాటాను అభినందిస్తున్నామన్నారు. ఐటి రంగంలో ప్రతి నలుగురిలో ఒకరు తెలుగు వాళ్లు ఉన్నారన్నారు. ఐటిఐలను ఎంత అ భివృద్ధి పరిస్తే అంత మంచిదన్నారు. ఐటిఐలు ఇం తకుముందు వేరు ఇపుడు వేరని, ఇక ముందు ఐ టిఐలను తానే పర్యవేక్షిస్తానని రేవంత్ చెప్పారు. ఈ శాఖ తన దగ్గరే ఉంటుందని, తానే పర్యవేక్షిస్తానని, ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తానని సిఎం రేవం త్ పేర్కొన్నారు. ఐటిఐలను ఏటిసిలుగా మార్చేందుకు రెండు నెలల క్రితమే టాటా టెక్నాలజీస్ లి మిటెడ్‌తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

ఆధునిక పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఏటిసిల్లో యువతకు శిక్షణ ఇవ్వనున్నా రు. ఏటిసిల్లో అధునాతన సామగ్రి, సాంకేతికత ఏ ర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ కేంద్రాల్లో ఏటా 15, 860 మందికి ఆరు రకాల కోర్సుల్లో లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నారు. అలాగే 31,200 మందికి 23 రకాల కోర్సుల్లో షార్ట్ టర్మ్ కోచింగ్ ఇస్తారు. ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ ఏటా రూ. 307.96 కోట్లు కాగా, టిటిఎల్ వాటా రూ. 2,016.25 కోటు. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందిన వారికి టిటిఎల్ ఉద్యోగాలు కల్పించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News