Monday, January 20, 2025

ఉమెన్ సేఫ్టీ కోసం ‘టీ-సేఫ్ యాప్’ ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్ రెడ్డి ‘టీ సేఫ్’ అనే యాప్‌ను మంగళవారం ఆవిష్కరించారు. మహిళల ప్రయాణ భద్రత కోసం ఈ యాప్‌ను రూపొందించినట్లుగా చెప్పారు. అన్ని రకాల మొబైల్ ఫోన్లకు ఇది అనుకూలంగా ఉంటుందని, ఈ యాప్ ద్వారా మహిళల ప్రయాణ భద్రతను పోలీసులు పర్యవేక్షిస్తూ ఉండవచ్చన్నారు. తెలంగాణ సచివాలయంలో ఈ యాప్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రయాణ సమయాల్లో ఏవైనా అనుకోని సంఘటనలు సంభవించితే పోలీసుల సహాయాన్ని తీసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది.

తాము ఉన్న ప్రదేశానికి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు ఎస్‌ఓఎస్ మెసేజీ వెళ్తుంది. సహాయం కోరిన వారు ఎక్కడ ఉన్నారనేదీ పోలీసులకు ఈ యాప్ ద్వారా సులువుగా తెలిసిపోతుంది. ఎస్‌ఓఎస్ సందేశాన్ని పంపించిన అతి కొద్ది నిమిషాల్లోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేలా ఈ యాప్‌ను డిజైన్ చేశారు. చాలా సందర్భాల్లో ఈ యాప్ మహిళలకు భద్రత కల్పించింది కూడా. దీనిపై పలు కథనాలు సైతం మీడియాలో వచ్చిన విషయం విదితమే. ఇలాంటి యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. దీనికి ‘టీ- సేఫ్’ అని పేరు పెట్టింది. దీనిపై ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించడానికి వీలుగా మహిళా పోలీసు భద్రతా విభాగం రూపొందించిన పోస్టర్‌ను సిఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు.

కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణా రావు, దామోదర్ రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజిపి రవి గుప్తా పాల్గొన్నారు. మహిళల భద్రత, ప్రయాణ సమ యంలో వారిని పర్యవేక్షించడానికి వీలుగా టీ- సేఫ్ యాప్‌ను రూపొందించినట్లు మంత్రులు వెల్లడించారు. మహిళలు ఒంటరిగా ప్రయాణించే సందర్భాల్లో తక్షణ సహాయాన్ని అందించడానికి, లైవ్ లొకేషన్ షేర్ చేయడానికి, ప్రయాణ మార్గం నావిగేట్ చేయడానికి, ఆకస్మిక మార్పులు జరిగినప్పుడు పసిగట్టి పోలీసులు అప్రమత్తం కావడానికి వీలైన అనేక ప్రత్యేక ఫీచర్లను టీ-సేఫ్ యాప్‌లో ఉన్నట్లు వెల్లడించారు. కాగా, మహిళలకు 24 గంటల పాటు భద్రత కల్పించడానికి ఏపీ ప్రభుత్వం గతంలో ‘దిశ’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అధికారిక లెక్కల ప్రకారం.. ఏపీలో నాలుగున్నర లక్షల మందికి పైగా యూజర్లు తమ స్మార్ట్ ఫోన్లల్లో ఈ యాప్ ను ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News