Friday, November 15, 2024

ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరిన సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం అయ్యారు. అక్కడ పార్టీ అగ్రనాయకులతో ఆయన బేటీ కానున్నారు. కొత్తగా మంత్రులుగా 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. కానీ 24 గంటలు కావోస్తున్న శాఖలపై ఇంకా క్లారిటీ రాలేదు. మంత్రుల శాఖల కేటాయింపుపై అధిష్ఠానంతో రేవంత్ చర్చించునున్నారు. ప్రమాణం చేసిన రోజే శాఖల కేటాయింపు అనేది ఆనవాయితీగా వస్తుంది. మంత్రుల శాఖలపై ఇవాళ సాయంత్రం వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కేబినెట్ లో మరో ఆరు ఖాళీలపై కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ చర్చించనున్నారు. శాఖల కేటాయింపుపై ఇప్పటికే సస్పెన్స్ కొనసాగుతోంది. పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణపై అగ్రనేతలతో ఆయన చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని ఇవాళ రాత్రికి హస్తిన నుంచి రేవంత్ తిరుగు ప్రయాణం కానున్నారు. శనివారం ఉదయం ప్రొటెం స్పీకర్ చేత రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం జరుగుతోంది. ఇప్పటికే అసెంబ్లీ స్వీకర్ గా దాదాపు గడ్డం ప్రసాద్ కుమార్ పేరు ఖరారు అయినట్లు సమాచారం. ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎంఎల్ఏల చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News