- Advertisement -
ప్రధాని మోడీకి సిఎం రేవంత్‌రెడ్డి సోమవారం లేఖ రాశారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి, ఎంఐఎం, సిపిఐ నాయకులతో కలిసి ప్రధానిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరుతూ సిఎం ఈ లేఖ రాశారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్‌లు 42 శాతానికి పెంచాలని రెండు బిల్లులను ఆమోదించిన నేపథ్యంలో ఈ బిల్లులకు కేంద్ర మద్ధతు ఇవ్వాలని కోరేందుకు ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వాలని సిఎం రేవంత్ ఈ లేఖలో కోరారు.
- Advertisement -