Monday, December 23, 2024

లండన్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి చిల్లర రాజకీయ విమర్శలు చేశారు

- Advertisement -
- Advertisement -

సిఎం గల్లీ కార్యకర్తలా మాట్లాడడం మానుకోవాలి
ఎన్‌ఆర్‌ఐ బిఆర్‌ఎస్ యుకె కార్యదర్శి సతీశ్ రెడ్డి గొట్టెముక్కల

మనతెలంగాణ/హైదరాబాద్ : లండన్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్ గాంధీ భవన్‌లో లేదా గల్లీ కాంగ్రెస్ మీటింగ్‌లో మాట్లాడినట్టు చిల్లర రాజకీయమర్శలు చేశారని ఎన్‌ఆర్‌ఐ బిఆర్‌ఎస్ యుకె కార్యదర్శి సతీశ్ రెడ్డి గొట్టెముక్కల మండిపడ్డారు. అందుకు ఎన్నారైలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో లండన్‌కు వచ్చిన మాజీ మంత్రి కెటిఆర్ ఎంతో హుందాగా ప్రసంగించి ఎన్‌ఆర్‌ఐలలో ఎంతో స్ఫూర్తి నింపారని, కానీ ఇప్పుడు సిఎం హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డి వేదిక ఏంటనే సోయి లేకుండా కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో మాట్లాడినట్టు తెలంగాణ పరువు తీసే విధంగా వ్యవహరించారని అన్నారు.

రాజకీయాలు ఎప్పుడూ ఉండేవే అని, కానీ సిఎం రేవంత్ రెడ్డి ఇంకా గల్లీ కార్యకర్తలా మాట్లాడడం మానుకొని సందర్భానుసారంగా ప్రవర్తిస్తే ఆయనకు, తెలంగాణ గౌరవానికి మంచిదని హితవు పలికారు. తెలంగాణను కెసిఆర్‌ను రెండింటిని వేరుగా చూడలేమని చెప్పారు. ఒక తాత్కాలిక విరామానికి అంత అహంకారం పనికి రాదని, తప్పకుండా రానున్న ఎంపి ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలని సిఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని, లేకుంటే ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. ఇటీవల అధికారిక పర్యటనలో భాగంగా లండన్ వచ్చిన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ‘యూకే ప్రవాస సంఘాలు’ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఎన్‌ఆర్‌ఐలను ఉద్దేశించి మాట్లాడుతూ చిల్లర రాజకీయమర్శలు చేశారని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News