కాలిఫోర్నియాలో జరిగిన బిజినెస్ కాన్ఫరెన్స్‌లో ప్రపంచ ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్, ప్రొ.రామ్ చరణ్‌తో సిఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యా రు. ప్రపంచ వ్యాపార ఆలోచనలు , ధోరణులను టాప్ కంపెనీలు, సీఈఓలు, బోర్డుల తో కలిసి పనిచేసిన 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న రామ్ చరణ్ తెలంగాణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళికలపట్ల ఎంతో ఆసక్తిగా ఉ న్నారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికాలో కీలక ఇన్‌ప్లుయెన్సర్‌గా, టయోటా, బ్యాంక్ ఆఫ్ అమెరికా,
కీ బ్యాంక్, నోవార్టిస్, యిల్డిజ్ హోల్డిం గ్స్, యూఎస్‌టి గ్లోబల్, ఫాస్ట్ రిటైలింగ్, మ్యాట్రిక్స్‌తో సహా ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలతో ఆచరణాత్మక అనుభవం, సంక్లిష్టతను తగ్గించడంలో ప్రసిద్ధి చెందిన ప్రొ.రామ్ ప్ర స్తుత పరిస్థితుల్లో వ్యాపారం, ధోరణులను అమలు చేయడానికి తమకు అ నేక ఆసక్తికరమైన ఆలోచనలను అం దించారని సిఎం రేవంత్ చెప్పారు. ప్రొ.రామ్‌చరణ్‌ను హైదరాబాద్‌కు రావాలని తెలంగాణ అభివృద్ధిలో పా లుపంచుకోవాలని ఆహ్వానించినట్లు సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.