Friday, December 20, 2024

యశోదలో చికిత్స పొందుతున్న మంత్రి వెంకట్ రెడ్డిని పరామర్శించిన సీఎం

- Advertisement -
- Advertisement -

అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. గత కొద్దిరోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్న మంత్రి వెంకట్ రెడ్డి.. హైటెక్ సిటీ యశోదా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్.. ఆస్పత్రికి వెళ్లి మంత్రిని కలిసి ఆయన ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కూడా మంత్రి చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News