Wednesday, January 22, 2025

నెదర్లాండ్స్ రాయబారితో సిఎం రేవంత్‌రెడ్డి భేటీ.

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః భారత్‌లో పర్యటిస్తున్న నెదర్లాండ్స్ కింగ్ డమ్ రాయబారి మెరిసా గెరారడ్స్ బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై చర్చించారు. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని, అగ్రికల్చర్ సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్ ఏర్పాటు, మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగస్వామ్యం అంశాలు ఈ భేటీలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్ధిక శాఖ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News