రాహుల్‌గాంధీతో భేటీ అనంతరం సిఎం రేవంత్‌రెడ్డి
మంత్రివర్గ విస్తరణ, టిపిసిసి కూర్పు
ప్రస్తావనకు రాలేదు ఫిరాయింపులపై
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు
నడుచుకుంటాం ఇప్పటివరకు దేశంలో
మరే రాష్ట్రం కులగణన చేపట్టలేదు
కులగణన అమలుకు కమిటీ లేదా కమిషన్
ఏర్పాటు చేస్తాం దాని నివేదికకు యథాతథంగా
చట్టరూపం కల్పిస్తాం ఢిల్లీలో
మీడియాతో సిఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్
ప్రధాని మోడీని నేను వ్యక్తిగతంగా తిట్టలేదు. కించపరిచేలా మాట్లాడలేదు. కేవలం మోడీ పుట్టుకతోనే బిసి కాదని మాత్రమే
అన్నాను. మోడీ పుట్టుకతో బీసీ కాదు కాబట్టే బిసిల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నాను. నా వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు వక్రీకరించారు. మోడీకి చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన చేయాలి
పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటాం. సుప్రీంకోర్టు తీర్పు కన్నా ముందే బిఆర్‌ఎస్ నేత కెటిఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలో మంత్రులుగా చేరారో చెప్పాలి. నాపై అబద్ధపు ప్రచారాలు చేస్తూ పైశాచిక ఆనందాలు పొందుతున్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్ : బడ్జెట్ స మావేశాలలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామనిముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో శనివారం 10జన్‌పథ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సిఎం రేవంత్ రెడ్డి గంటపాటు భేటీ అయ్యారు. అనంత రం ఆయన అక్కడ మీడియాతో చిట్‌చాట్ చేసారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రె డ్డి మాట్లాడుతూ , బడ్జెట్ సమావేశాల్లో ఎ స్సీ వర్గీకరణ బిల్లు తెస్తామన్నారు. ఎస్సీ ఉ పకులాల వర్గీకరణపై కమిషన్ అధ్యయ నం చేస్తోందని సిఎం తెలిపారు. కులగణ న, ఎస్సీ వర్గీకరణలో రాజకీయ జోక్యం లే దన్నారు. కులగణన అమలుకు కమిటీ లే దా కమిషన్ ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీ లేదా కమిషన్ ఇచ్చే నివేదికను చట్టరూపంలోకి తీసుకువస్తామని సిఎం రేవంత్‌రెడ్డి వె ల్లడించారు. ఏకసభ్య కమిషన్ నివేదికను యథాతథంగా అమలు చేస్తామన్నారు. దే శంలో ఏ రాష్ట్రం కులగణన చేయలేదని, తెలంగాణ కులగణన దేశానికే రోడ్‌మ్యాప్ కాబోతుందని సిఎం చెప్పారు. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కమిటీ కూర్పు పై తాను రాహుల్ గాంధీతో చర్చిస్తానన్నది కేవలం మీడియా ఉహాగానం తప్పా అసలు ఆ విషయమే తమ మధ్య ప్రస్తావనకు రాలేదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోడీని నేను వ్యక్తిగతంగా తిట్టలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానిని కించపరిచేలా మాట్లాడలేదన్నారు. వ్యక్తిగతంగా కానీ ప్ర ధాని పదవిని కానీ
తాను కించపరచలేదని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసారు. కేవలం మోడీ పుట్టుకతోనే బిసి కాదని మాత్రమే అన్నానని, మోడీ పుట్టకతో బీసీ కాదు కాబట్టే బిసిల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నానని సిఎం రేవంత్ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు వక్రీకరించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మోడీకి చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన చేయాలని సవాల్ విసిరారు.తెలంగాణ లో జరిగన కులగణనపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాజకీయ కోణంలోనే కాదు ప్రజా సంక్షేమం కోణంలోనే కులగణన జరిగిందని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు కావాలనే అబద్దాలను ప్రచారం చేస్తున్నాయని, తమ పాలనలో ఎక్కడా లెక్క తప్ప లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కులగణనకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, ఆ వెంటనే పార్లమెంట్ కు పంపిస్తామని పేర్కొన్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు
పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో సు ప్రీంకోర్టు ఎలా తీర్పు ఇస్తుందో చూడాలని రేవంత్‌రెడ్డి అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు కన్నా ముందే బిఆర్‌ఎస్ నేత కెటిఆర్ ఏదే దో మాట్లాడుతున్నారని విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలో మంత్రులుగా చేరారో చెప్పాలని ప్రశ్నించారు. తనపై అబద్దపు ప్రచారాలు చేస్తూ పైశాచిక ఆనందాలు పొందుతున్నారని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాకు రాహుల్ గాంధీతో ఎలాంటి గ్యాప్ లేదు
‘నేను కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నన్ను కొందరు అంగీకరించక పోవచ్చు, కానీ, నా పని నేను సక్రమంగా చేస్తున్నాను’ అనని సిఎం రేవంత్‌రెడ్డి అన్నా రు. తనను ఎవరూ ప్రశ్నించే పరిస్థితిని తెచ్చుకోనన్నా రు. కాంగ్రెస్ తరఫున రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చింది తాను అని, ఆ హామీలను అమలు చేయకపోతే అడిగేది కూడా తననేని ఆయన తెలిపారు. కేబినేట్ విస్తరణ తన ఒక్కడి నిర్ణయం కాదనీ, తన గురించి ఎవరు ఏమనుకున్నా..? ఎలాంటి విమర్శలు చేసినా తాను పట్టించుకోనని ఆయన పేర్కొన్నారు. పిసిసి కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై కొందరు పైశాచిక ఆనం దం కోసం అబద్దాలు ప్రచారం చేస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి మండి పడ్డారు. అలాగే రాహుల్ గాంధీతో తనకు ఎలాంటి గ్యాప్ లేదని సిఎం స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో భేటీ, మీడియాతో ఇష్టాగోష్ఠి ముగిసిన అనంతరం సిఎం హైదరాబాద్ బయలుదేరారు.
రాహుల్ గాంధీతో సిఎం రేవంత్ భేటీ
ఢిల్లీ పర్యటనలో భాగంగా సిఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలను రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి వివరించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో రెండు బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు రాహుల్‌తో సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఒక బహిరంగ సభకు హాజరుకావాలని కావాలని సిఎం రాహుల్‌ను కోరారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ గురించి రాహుల్‌గాంధీకి సిఎం రేవంత్ వివరించారు. ఎస్సీ వర్గీకరణ కమిషన్ గడువు పెంచినట్లు రాహుల్‌తో సిఎం తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో చట్టం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు రాహుల్‌తో సిఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక
ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు వస్తోంది. అయితే ఈ విషయంలో ఎలాంటి అడుగులు పడటం లేదు. రాహుల్ గాంధీతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయిన సందర్భంలో కూడా తమ మధ్య మంత్రివర్గ విస్తరణపై చర్చ జరగలేదని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించడంతో, బహు శా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక అన్ని సమీకరణాలు బేరీజు వేసుకున్నాకే మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.