Sunday, December 22, 2024

ఓలా, ఉబర్, ఆటో డ్రైవర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓలా, ఉబర్, ఆటో డ్రైవర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మహాలక్ష్మీ పథకం కింద మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం మహిళలకు ఉపయోగకరంగా ఉన్నా.. తమకు మాత్రం గొడ్డలిపెట్టుగా మారిందని ఓలా, ఉబర్, ఆటో డ్రైవర్లు ఆందోళనలు చేస్తున్నారు. ఉచిత బస్సు సౌకర్యంతో ప్రభుత్వం.. తమ జీవనోపాధిని దెబ్బ తీస్తుందని.. తమ పొట్ట కొట్టొదంటూ ఆటో డ్రైవర్లు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం స్పందిస్తూ.. ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని తెలిపింది.

తాజాగా శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో భేటీ అయ్యారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేయడంతో..ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, మాణిక్ థాక్రే పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News