Monday, December 23, 2024

గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సిఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
గల్ప్ కార్మికులను ఆదుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ ఉపాదిపై ఆదారపడి ఉన్నాయన్నారు. ఏజెంట్ల చేతిలో చిక్కుకుని మోసపోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏజెంట్లకు చట్టబద్దత ఉండాలని… రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్నవాళ్లే ఏజెంట్లని అన్నారు. గల్ఫ్ వెళ్లే ముందు కార్మికులకు శిక్షణ ఇస్తామన్నారు.

ప్రజాభవన్ లోనే గల్ఫ్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తామని సిఎం తెలిపారు. సెప్టెంబర్ 17లోగా గల్ఫ్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తామన్న రేవంత్.. సీనియర్ ఐఏఎస్ నేతృత్వంలో గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తామని తెలిపారు. బాధితులు ఎప్పుడైనా ప్రజాభవన్ లో సంద్రించేలా బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. గల్ఫ్ కార్మికుల ప్రమాద బీమా రూ.5 లక్షలు ఇస్తామని.. గల్ఫ్ బాధిత పిల్లలకు మంచి చదువును అందిస్తామని సిఎం రేవంత్ హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News