Wednesday, January 22, 2025

ఒకే గొడుగు కిందకు విపత్తు విభాగాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజధాని నగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడు గు కిందకు తీసుకురావాలని దీనికోసం విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూని ట్ గా తీసుకొని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూ పొందించాలని ఆయన సూచించారు. మొదటిసారిగా బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన సిఎం రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం వర్షాకాలంలో మా త్రమే కాకుండా 365 రోజులు పనిచేసేలా వ్యవస్థను రూపొందించాలన్నారు.ఒక్కో విభాగం నుం చి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా వ్యవస్థ ఉం డాలని సిఎం రేవంత్ సూచించారు. జూన్ 4వ తే దీ లోగా దీనికి సంబంధించిన పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని, నాలాల పూడికతీతలో నిర్లక్ష్యం వద్దని, పూడిక తీసిన చెత్తను సమీప ప్రాంతాలకు తరలించాలని సిఎం సూచించారు. క్వారీ ఏరియాలను గుర్తించి ఆ ప్రాంతాలకు తరలించే లా చర్యలు తీసుకోవాలని కోడ్ ముగిసిన తరువాత ఆ కస్మిక తనిఖీలు నిర్వహిస్తానని తెలిపారు.

పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఓపెన్ సెల్లార్ గుంతల వద్ద ముందు జాగ్రత్త చర్యలు చే పట్టాలని వాటికి బారీ కేడింగ్ ఉండేలా చర్యలు చే పట్టాలని సిఎం రేవంత్ ఆదేశించారు. గతంలో జ రిగిన సంఘటనలు ఆధారంగా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సిఎం రేవంత్ పేర్కొన్నారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చే యాలని కంటోన్మెంట్ ఏరియాలో నాలాల సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సిఎం అధికారులకు తరువాయి
సూచించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. సమస్యాత్మక నాలాల వద్ద అవసరమైతే ప్రతిరోజు క్లీనింగ్ చేపట్టాలని, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని, పవర్ మేనేజ్‌మెంట్ సరైన విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతినేలా వ్యవహారిస్తే సహించేది లేదని, నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని, పనిచేసే వారిని ప్రోత్సహిస్తామని వారికి ఉన్నత స్థానం కల్పిస్తామని సిఎం రేవంత్ హామీనిచ్చారు.

డ్రగ్స్ నిర్మూలన కోసం పని చేసే వారిని ప్రోత్సహించాలి…
సమీక్షలో భాగంగా గంజాయి,డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించిన పురోగతిపై నార్కోటిక్స్ డ్రగ్స్ అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని ఆయన ఆదేశించారు. ఈ విషయంలో మరింత యాక్టివ్ గా పనిచేయాలన్నారు. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని సిఎం రేవంత్ సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని, గంజాయి, డ్రగ్స్ సరఫరా చైన్‌కు బ్రేక్ వేయాలని ఆయన ఆదేశించారు. వాటిని సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలుండాలన్నారు. డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు ఉన్నా ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేయాలని, డ్రగ్స్ నిర్మూలన కోసం ఎఫెక్టివ్ గా పని చేసే వారిని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని ఆ పేరు వినపడకుండా చూడాలని దానికోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కావాలన్న సమకూరుస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని, దేశంలోని ఇతర రాష్ట్రాలకు టిజిఎన్‌ఏబి ఆదర్శంగా నిలవాలని సిఎం రేవంత్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News