Thursday, March 6, 2025

జానారెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి..?

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి గురువారం మధ్యాహ్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. త్వరలో కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు తదితర అంశాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. ఈ సందర్భంగా జానారెడ్డితో సిఎం రేవంత్ గంటపాటు అంతరంగిక చర్చలు జరిపినట్లుగా సమాచారం. అనంతరం లంచ్ ముగించుకొని సిఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్లిపోయారు.

అయితే, జానారెడ్డితో సిఎం భేటీ కావడంపై ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై వారిద్దరూ చర్చించినట్టుగా తెలిసింది. దీంతోపాటు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక నామినేటెడ్ పోస్టులకు సంబంధించి వారిద్దరూ చర్చించినట్టుగా సమాచారం. దీంతోపాటు తీన్మార్ మల్లన్న రెడ్డిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, దానిపై జానారెడ్డి స్పందించిన తీరుతో పాటు జానారెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై కూడా సిఎం రేవంత్‌రెడ్డి జానారెడ్డితో చర్చించినట్టుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News