Saturday, April 5, 2025

గవర్నర్‌ను కలిసిన సిఎం, డిప్యూటీ సిఎం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపనున్నారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో శనివారం ఉదయం గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిశారు. రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో ఆదివారం ఉదయం జాతీయ జెండా ఆవిష్కరణ, ఇతర కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ వేడుకులకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రేపు సాయంతరం ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనంగా జరుపుతారు. వివిధ జిల్లాలకు చెందిన కళాబృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News