Sunday, December 22, 2024

గవర్నర్‌తో కీలక భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో సిఎం రేవంత్ రెడ్డి సోమవారం సుమారు రెండుగంటల పాటు భేటీ అయ్యారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన కొత్త ఐదు బిల్లులతో పాటు పాత పెండింగ్ బిల్లులు (మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్, పంచాయతీరాజ్ చట్టం సవరణలు, ప్రైవేటు యూనివర్శిటీ)సహా పలు అంశాలపై వీరిద్దరూ చర్చించినట్లుగా తెలిసింది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీలు, ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి, మంత్రివర్గ విస్తరణ గురించి కూడా వీరిద్దరూ మాట్లాడుకున్నట్టుగా సమాచారం. వీటితో పాటు ఉమ్మడి సమస్యలపై చర్చించినట్టుగా తెలిసింది. పదేళ్లుగా ఎపితో ఉమ్మడి ఆస్తులు, అప్పుల వ్యవహారం పెండింగ్‌లో ఉంది.

ఈ నెల జూన్ 2వ తేదీతో హైదరాబాద్‌పై ఉమ్మడి రాజధాని హక్కులు ముగిశాయి. కాగా, ఇటీవలే గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఎపి సిఎం చంద్రబాబుతో భేటీ అయిన నేపథ్యంలో ఉమ్మడి ఆస్తులపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై వారిద్దరూ చర్చించినట్టుగా తెలిసింది. యూనివర్సిటీల్లో విసిల నియామకం, ఆగస్టు 15వ తేదీన ఖైదీల విడుదలకు సంబంధించి ప్రభుత్వ ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లుగా సమాచారం. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం, అక్టోబర్ 2 గాంధీ జయంతి, జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను గవర్నర్ అనుమతితో విడుదల చేస్తుం టారు. ఈ సమావేశం అనంతరం రేవంత్‌రెడ్డి గవర్నర్‌తో కలిసి భోజనం చేశారు. రేవంత్ వెంట ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News