పెట్టుబడులు పెట్టడడానికి ఆసక్తి
కనబర్చిన ఎఎస్‌ఐఎ ప్రతినిధులు
డిసెంబర్‌లోగా తెలంగాణకు
వస్తామని హామీ సెమీ కండక్టర్
పరిశ్రమల రాకతో పెరగనున్న
ఉపాధి అవకాశాలు ఫ్యూచర్
సిటీ, మూసీ పునరుజ్జీవ
ప్రాజెక్టులపై సింగపూర్ వాణిజ్య
పర్యావరణ మంత్రి ఆసక్తి
పెట్టుబడులపై ఆసక్తి ప్రదర్శించిన
ఎఎస్‌ఐఏ ప్రతినిధులు
డిసెంబర్‌లోగా తెలంగాణాకు వస్తామని
ఎఎస్‌ఐఏ ప్రతినిధుల బృందం హామీ
ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన
ప్రాజెక్ట్‌లపై సింగపూర్ వాణిజ్య,
పర్యావరణ మంత్రి ఆసక్తి
మనతెలంగాణ/హైదరాబాద్: సెమీకండక్టర్ పరిశ్రమలో కీలక పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్ర ప్రభు త్వం మరో ముందడుగు వేసింది. తెలంగాణలో ఉన్న అవకాశాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు, అనుకూలమైన విధానాలు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆకర్షించాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వ ఇచ్చిన ఆహ్వానానికి ఎఎస్‌ఐఏ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. సెమీకండక్టర్ల పరిశ్రమల పెట్టుబడులపై వారు ఆసక్తి ప్రదర్శించారు. ఈ ఏడాది చివరలో సింగపూర్ నుంచి తమ ప్రతినిధుల బృందం హైదరాబాద్‌ను సందర్శించి, పరిశీలిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి బృందానికి హామీనిచ్చింది. ఈ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల కల్పనతో పాటు, ఆర్థికాభివృద్ధికి సహాయపడే అవకాశం ఉంది. సెమీకండక్టర్ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు భవిష్యత్‌లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడనున్నాయి. హైదరాబాద్ ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మార్చడంలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించనుంది.
సెమీ కండక్టర్ పరిశ్రమ అసోసియేషన్‌తో రౌండ్‌టేబుల్ సమావేశం
మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్‌లో సెమీ కండక్టర్ పరిశ్రమ అసోసియేషన్ (ఎస్‌ఎస్‌ఐఏ)తో ప్రత్యేక రౌండ్ టేండ్ చర్చ నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ సంస్థలు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎస్‌ఎస్‌ఐఏ చైర్మన్ బ్రియాన్ టాన్, వైస్ చైర్మన్ టాన్ యూ కాంగ్, సెక్రటరీ సి.ఎస్.చుహ తదితర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ చర్చల్లో రాష్ట్రంలో సెమీకండక్టర్ పరిశ్రమ స్థాపనకు అందుబాటులో ఉన్న అనుకూలమైన పరిస్థితులను మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వాతావరణం, ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందించే సహకారం ప్రోత్సాహకాల గురించి మంత్రి శ్రీధర్‌బాబు తెలియచేశారు. ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, తెలంగాణ కీలకమైన కేంద్రంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
వాణిజ్య, పర్యావరణ మంత్రి
గ్రేస్ ఫు హై యిన్‌తో సిఎం బృందం భేటీ
సింగపూర్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ వాణిజ్య, పర్యావరణ మంత్రి గ్రేస్ ఫు హై యిన్‌తో భేటీ అయ్యింది. తెలంగాణతో వివిధ రంగాల్లో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యంపై ఈ సందర్భంగా చర్చలు జరిపారు. ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణలకు పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వారు వివరించారు. ప్రధానంగా నగరాలు, పట్టణాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటి వనరుల నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, స్పోర్ట్, సెమీ కండక్టర్ల తయారీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాలకు ఉన్న అనుకూలతల గురించి తెలియచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించేందుకు సింగపూర్ మంత్రి గ్రేస్ పు హైయిన్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రైజింగ్ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రధానంగా ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, నీటి వనరుల నిర్వహణ, తెలంగాణ ఎంచుకున్న సుస్థిర వృద్ధి ప్రణాళికలపై ఎక్కువ ఆసక్తి ప్రదర్శించారు. పలు ప్రాజెక్టుల్లో పరస్పరం కలిసి పని చేసేందుకు ఆయన అంగీకరించారు. ఉమ్మడిగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు, వాటిపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాలను గుర్తించాలని ఆయన నిర్ణయించారు.