Sunday, November 24, 2024

21న కలెక్టర్లతో సిఎం ఉన్నతస్థాయి భేటీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21న అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి కలెక్టర్లంతా సిద్ధంగా ఉండాలని సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. కొత్త రేషన్ కార్డులు, మహాలక్ష్మి పథకం అమలు, భూ రికార్డుల సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు సహా మరికొన్ని అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నా రు. కాగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కలెక్టర్లతో రేవంత్ రెడ్డి సమావేశం కావాలని నిర్ణయించడం ఇదే మొదటిసారి.

దీంతో కలెక్టర్లంతా పూర్తి అప్రమత్తంగా సమావేశానికి హాజరు కానున్నట్టుగా తెలిసింది. వివిధ శాఖలలోని వాస్తవ పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చిన రేవంత్ రెడ్డి ఇక హామీల అమలుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీ మా అమలు పరచగా మిగతా హామీల దిశగా ప్రభుత్వం ఫోకస్ పెట్టిం ది. ధరణిని ప్రక్షాళన చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన నేపథ్యలో ఇటీవల ధరణి లోటుపాట్లపై అధికారులు, నిపుణులు, ఉద్యోగ సంఘాలతో సీఎం కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. ప్రజావాణి వస్తున్న ఫిర్యాదుల్లో భూసమస్యలే అధికంగా ఉండటంతో జి ల్లా స్థాయిలో పరిష్కారం కోసం సిఎం కలెక్టర్లకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్టుగా తెలిసింది. అలాగే పెద్ద సంఖ్యలో కొత్తరేషన్ కార్డు కో సం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అర్హులకు త్వరలోనే కొత్త రేషన్ కార్డు లు ఇస్తామని ఇటీవలే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆలాగే రైతుబంధు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News