Saturday, April 5, 2025

అందెశ్రీ కవితని ప్రస్తావించిన సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమస్ఫూర్తిని నింపిన అందెశ్రీ కవితని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు ఇచ్చి విలక్షణ తీర్పు.. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అన్నారు. కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్న ఆలోచన విపక్షానికి లేదని తెలిపారు. బిఆర్‌ఎస్‌ సభ్యులు తెలంగాణ ప్రజల్ని నిరాశపరిచారని చెప్పారు. బిఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబపాలనకే పరిమితమవుతుందని మరోసారి నిరూపించారన్నారు. బిఆర్ఎస్ నాయకులు ఇలానే ఉంటే వారిని ఎక్కడికి పంపించాలో ప్రజలకు తెలుసన్నారు. గడీలు బద్దలుకొట్టి ప్రజావాణికి జనం క్యూ కడుతుంటే బిఆర్‌ఎస్‌ నేతలు భరించలేకపోతున్నారని సిఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News