Tuesday, December 3, 2024

జనగణనలో కులగణన చేర్చండి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో బుధవారం నుంచి ప్రారంభమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వే తీరును గవర్నర్‌కు సిఎం రేవంత్ వివరించారు. ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలను గవర్నర్‌కు సిఎం తెలియచేశారు. సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వే దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలవనుందని సిఎం తెలిపారు.

2025 చేపట్టే దేశవ్యాప్త జనగణనలో ఈ కులసర్వేను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సిఎం రేవంత్ గవర్నర్‌ను కోరారు. ఈ సందర్భంగా తన సోదరుడి కూతురు వివాహానికి సిఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌ను ఆహ్వానించారు. సిఎం రేవంత్ వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపిలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, గుత్తా అమిత్ రెడ్డిలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News