Wednesday, October 16, 2024

ఆదాయ సమీకరణలో లోపాలొద్దు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :వార్షిక లక్ష్యాల కు అనుగుణంగా ఆదాయ సమీకరణ చేయాలని వివిధ శాఖలను అధికారులను ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి సమావేశం ఆదేశించారు. ఆదాయం పెంపునకు సంబంధించి సిఎం రేవంత్ వి విధ శాఖల అధికారులతో తన నివాసంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమా రి, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యా రు. ఈ సందర్భంగా తెలంగాణలో ఆదాయ స మీకరణాలకు ఉన్న అవకాశాలపై సిఎం ఆరా తీశారు.

ఓ వైపు ఆదాయ మార్గాలు తగ్గుతుంటే అప్పుల భారం పెరుగుతుంటడంతో ఆదాయ వనరులను సమకూర్చుకోవడం ఎలా అన్న దా నిపై సిఎం ఈ సమీక్షలో చర్చించారు. ముఖ్యం గా ఆరు గ్యారంటీల అమలుతో పాటు ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాల కు ఎక్కడా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏర్పడకుండా ఆదాయమార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విషయంలో సిఎం ఆరా తీ శారు. కేంద్ర వద్ద నిధులు రాబట్టుకునే విషయంలో ఎక్కడైనా గ్యాప్ ఏర్పడిందా అనే అం శాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కెసిఆర్ ప్రభుత్వం గడిచిన పదేళ్ల లో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసింది. అప్ప టి అప్పులకు వడ్డీలు కట్టేందుకే రాష్ట్ర ఖజానాలో మెజార్టీ వాటా పోతుంది. ఈ నేపథ్యంలో సిఎం ఎప్పటికప్పుడు ఆదాయం వనరుల పెంపుపై అ ధికారులతో సమీక్ష జరుపుతున్నారు. ఈ స మీ క్ష అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి దశదిన కర్మ కు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరైన సిఎం ఈ సందర్భంగా పురుషోత్తమ్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News