Friday, December 20, 2024

రామోజీరావు వద్దకు సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

గంటకు పైగా చర్చలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును సిఎం ఏ.రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్న సిఎం నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. గంటకుపైగా రామోజీ రావుతో వివిధ అంశాలను చర్చించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్న తీరు, మారిన ప్రజాపాలన విధానాల పైనా మాట్లాడుకున్నారు.

అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ సమకాలీన రాజకీయ పరిస్థితులను చర్చలు జరిపారు. లౌకికవాదాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీలు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ భేటీలో సిఎం వెంట సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంఎల్‌ఎ మల్ రెడ్డి రంగారెడ్డి, ఈనాడు ఎండి కిరణ్ కూడా ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News