Sunday, December 29, 2024

గల్ఫ్, ఓవర్సీస్ కార్మికుల కోసం రేవంత్ కొత్త విధానం!?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలతో పాటు విదేశాలకు వెళ్లే తెలంగాణ కార్మికుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త విధానం తీసుకు రాబోతున్నారు. ఇందు కోసం నగరంలోని తాజ్ డెక్కన్ హోటల్ లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు.

తెలంగాణలో ‘గల్ఫ్ అండ్ ఓవర్సీస్ వెల్ఫేర్ బోర్డ్’ ను ఏర్పాటు చేసి అందులో ఓ ఐఏఎస్ అధికారితో పాటు సిబ్బందిని నియమించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ వ్యవస్థ సెప్టెంబర్ 17వ తేదీ నాటికి ఏర్పాటయ్యేలా చూస్తామన్నారు. గల్ఫ్  ఉపాధి పై ఆధారపడిని కుటుంబాలు తెలంగాణలో 15 లక్షల కుటుంబాలు ఉన్నట్లు తెలిపారు.

విదేశాల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం ఫిలిప్పీన్స్, కేరళలో చక్కని విధానం ఉందని, వాటిని అధ్యయనం చేస్తున్నట్లు కూడా రేవంత్ రెడ్డి తెలిపారు.  గల్ఫ్ లో పనిచేస్తూ చనిపోయిన కార్మికుల కుటుంబానికి రూ. 5 లక్షలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించినట్టు సిఎం తెలిపారు. ఇబ్బందుల్లో ఉండే వారి సాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News