- Advertisement -
మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బిసి కులగణనపై మంత్రి వర్గంలో తీర్మానం చేశాం. మీరు అడగకుండానే సభలో పెట్టాం. స్వయంగా మేమే ముందుకు వచ్చి చేస్తున్నాం. విస్పష్టంగా చెప్తున్నాం.. పాలితులుగా ఉన్నవారిని పాలకులుగా తయారుచేయడమే మా ఉద్దేశం. జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించి వారి ఆర్థిక ప్రయోజనాలను నిలబెట్టాలని భావిస్తున్నాం. ఇంతమంచి తీర్మానం చేసినప్పుడైనా దాన్ని స్వాగతించి సూచనలు చేయాల్సిందిగా కోరుతున్నాం. సహేతుకమైన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది.. ఇంటింటికీ కుటుంబ సర్వే చేపడుతాం. సామాజిక, విద్య, అవకాశాల కోసమే కుటుంబ సర్వే. కులగణనను అమలు చేసే క్రమంలో న్యాయ, చట్టపరమైన చిక్కులపై అనుమానం ఉంటే సూచనలు ఇవ్వండి. అంతేగాని తీర్మానానికి చట్టబద్దత లేదన్నట్లుగా మాట్లాడడం మనందరికీ మంచిది కాదు. ఈ తీర్మానంపై రాష్ట్ర జనాభాలో అరశాతం ఉన్నవాళ్లకు బాధ ఉండొచ్చు.
- Advertisement -