Monday, January 20, 2025

కులగణనతో ఎవరి ఆస్తి తీసుకోం

- Advertisement -
- Advertisement -

50శాతంపైగా రిజర్వేషన్లు
కావాలంటే కులగణన జరగాలి
ఎవరు అడ్డ్డుపడినా కులగణన ఆగదు
విద్య, ఉపాధి అవకాశాలు
పెరగాలన్నా కులగణన కావాలి
2025లో జనగణనతో పాటు కులగణన
జరిపేలా కేంద్రం మెడలు వంచుతాం
ప్రజాపాలనలో విద్యకే పెద్దపీట..
బడ్జెట్‌లో 7శాతంపైగా నిధులు
టీచర్ పోస్టుల భర్తీ ద్వారా విద్యపై
మా చిత్తశుద్ధి చాటుకున్నాం
ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠ
పెంచాల్సిన బాధ్యత టీచర్లదే
విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ
రాణించాలి హాస్టల్ విద్యార్థులకు
నాణ్యమైన భోజనం పెట్టకపోతే
జైలుకే క్రీడల్లో ప్రతిభ కనబరిస్తే
ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం
కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ
పాఠశాలలను పర్యవేక్షించాలి
పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో విద్యారంగం
కుదేలు మేం వచ్చాకే డైట్,
కాస్మోటిక్ ఛార్జీలు పెంచాం
ఎల్‌బిస్టేడియంలో జరిగిన బాలల
దినోత్సవ కార్యక్రమంలో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ :కులగణనతో సంక్షేమ పథకాలను తొలగించం, ఎవరి ఆ స్తులను లాక్కోమని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు అ నుగుణంగా ఈ సర్వే కొనసాగుతోందని ఆ యన అన్నారు. కులగణనతో ఎవరికీ ఎలాం టి ఇబ్బందులు ఉండవని ఆయన స్పష్టం చే శారు.కులగణనపై అపోహలు తొలగించే బా ధ్యత విద్యార్థులదేనని సిఎం రేవంత్‌రెడ్డి అ న్నారు. తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి కులగణనపై అవగాహన కల్పించాలని సిఎం కోరారు. సంక్షేమ పథకాలు పెంచడానికే స మగ్ర సర్వే చేస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు కావాలంటే కులగణన జరగాలన్నా రు. కులగణన ఆధారంగా అమలవుతోన్న సంక్షేమ పథకాలను తొలగిస్తారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కులగణన ఎక్స్‌రే కాదనీ, మెగా హెల్త్ చెకప్ లాంటిదన్నారు. కొందరు గతంలో విద్యార్థుల శవాల మీద పదవులు పొందారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే, ఊచలు లెక్కించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. విద్యార్థులకు సన్న బియ్యంతో మంచి అన్నం పెట్టాలని, దొడ్డు బియ్యం, కుళ్లిన కూరగాయాలతో భోజనం పెడితే ఊరుకునేది లేదని ఆయన ఘాటుగా స్పందించారు. పిల్లలు మరోసారి కలుషిత ఆహారంపై రోడ్డెక్కి ఆందోళనలు చేయడం కనపడొద్దని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వం విద్యకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాము అధికారంలో వచ్చాక విద్యాశాఖను బలోపేతం చేసే దిశగా అధిక నిధులు కేటాయించామని ఆయన వివరించారు. అన్ని విశ్వవిద్యాలయాలకు విసిల నియామకంతో పాటు దేశంలో తొలిసారి విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్రానికే దక్కిందన్నారు.

గురుకులాలు, పాఠశాలలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి
ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ట దెబ్బతింటుందని, ఆ ప్రతిష్ట పునరుద్ధరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిరకాల మౌలిక వసతులను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపిలు తప్పకుండా పాఠశాలలను పర్యవేక్షించాలని విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా కలెక్టర్లు సహా జిల్లాస్థాయి అధికారులు పర్యవేక్షించకుంటే వారి పదోన్నతుల విషయంలో వాటిని పరిగణలోకి తీసుకుంటామని సిఎం పేర్కొన్నారు. పదేళ్లుగా పెంచకుండా ఉంచిన డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలను తాము పెంచామన్నారు. పదేళ్లలో 5 వేల పాఠశాలలు మూతపడ్డాయని, కానీ, తమ ప్రభుత్వం వచ్చాక బడ్జెట్‌లో విద్యాశాఖకు నిధులు పెంచామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ గురుకులాలను, పాఠశాలలను వారంలో రెండు రోజులు సందర్శించాలని ఆయన సూచించారు.

కెసిఆర్ మనువడు పెంచుకున్న కుక్కపిల్ల చనిపోతే
ప్రజా ప్రభుత్వానికి 11 నెలలు పూర్తయిందని ఈరోజు నుంచే ప్రజా ఉత్సవాలను ప్రారంభిస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థను బాగు చేయడానికి విద్యాకమిషన్ ఏర్పాటు చేశామన్నారు. నాడు కెసిఆర్ మనువడు పెంచుకున్న కుక్కపిల్ల చనిపోతే డాక్టర్లను జైల్లో వేశారని, కానీ, గురుకులాల్లో పిల్లలు చనిపోతే కనీసం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. త్వరలోనే యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని సిఎం రేవంత్ తెలిపారు. విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉంటామని ప్రమాణం చేయాలని సిఎం సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలపై వ్యతిరేకతను తొలగించాల్సింది టీచర్లే
ప్రభుత్వ పాఠశాలలు మీద వ్యతిరేకతను దూరం చేయాల్సింది టీచర్లే అని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 26,854 ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, 11వేల పై చిలుకు ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 36 లక్షల విద్యార్థులు చదువుతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ టీచర్లకు ఉన్న విద్యార్హత ప్రైవేటు టీచర్లకు ఉండదని, అయినా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపడానికే ఇష్టపడుతున్నారన్నారు. గ్రామాల్లో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలిసి సమస్య ఏమిటో తెలుసుకోవాలని సిఎం రేవంత్ సూచించారు. తెలంగాణ సమాజం వ్యసనాల వైపు వేగంగా వెళుతోందని, గంజాయి, డ్రగ్స్ లాంటి వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని సిఎం పిలుపునిచ్చారు. గతంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి పిల్లలను కలిశారా అని రేవంత్ ప్రశ్నించారు.

35 వేల మంది ఉపాధ్యాయులను బదిలీలు చేశాం
తమ ప్రభుత్వంలో 20వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని, 35 వేల మంది ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేశామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి విద్యకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని నిరూపించా మన్నారు. ఎడ్యుకేషన్ రెవల్యూషన్ తీసుకొచ్చి అందరికి విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత జవహర్ లాల్ నెహ్రూదని ఆయన తెలిపారు. ఉచిత నిర్బంద విద్య ద్వారా పేదలకు విద్యను అందించేందుకు సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్‌లు ఎంతో కృషి చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో 7శాతం పైగా విద్యా శాఖకు కేటాయించిందన్నారు. పాఠశాలల్లో అటెండర్స్, స్వీపర్స్, పారిశుద్ధ్య నిర్వణకు ప్రతి ఏటా రూ.150 కోట్లు కేటాయించామన్నారు. త్వరలోనే యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయబోతున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News