Thursday, January 23, 2025

ఢిల్లీ దుర్ఘటనలో ముగ్గురు అభ్యర్థులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం : సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో వరద నీళ్లు నిండి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశమంతా చర్చనీయాంశమైంది. తెలంగాణకు చెందిన యువతి తానియా సోని (25) ముగ్గురిలో ఒకరు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన చేశారు. ఢిల్లీలోని ఐఎఎస్ కోచింగ్ అకాడమీలో జరిగిన దుర్ఘటనపై తెలంగాణ రెసిడెంట్ కమిషనర్‌తో మాట్లాడటం జరిగిందన్నారు.

ఈ దుర్ఘటనలో ముగ్గురు అభ్యర్థులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. సింగరేణిలో మేనేజర్‌గా పని చేస్తున్న బీహార్ వాసి విజయ్ కమార్ కుమార్తె తానియా సోని కూడా మృతి చెందిన వారిలో ఉన్నారని వెల్లడించారు. విజయ్ కుమార్‌తో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం తరపున కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని రెసిడెంట్ కమిషనర్‌ను ఆదేశించడం జరిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News