Monday, December 23, 2024

రైతులను ఇబ్బందిపెట్టే వ్యాపారులపై ఎస్మా

- Advertisement -
- Advertisement -

రైతుల నుంచి పంట కొనుగోళ్లలో మోసాలకు
పాల్పడితే సహించేది లేదు ధాన్యం కొనుగోలు,
తరలింపు వెంటవెంటనే జరగాలి ఎక్కడ జాప్యం
జరిగినా వ్యాపారులదే బాధ్యత ధాన్యం కొనుగోళ్లు
సాఫీగా జరిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి
ఎక్కడైనా ఇబ్బందులు వస్తే వెంటనే
ఉన్నతాధికారులతో చర్చించాలి అధికారులకు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం

రైతులను గందరగోళానికి గురి చేయటం, వేధించటం వంటి ఘటనలపై కఠినంగా వ్యవహరించాలి. రైతులను ఇబ్బంది పెట్టవద్దు. ధాన్యం కొనుగోళ్లు, తరలింపు వెంట వెంటనే జరగాలి. ఎక్కడైనా జాప్యం జరిగితే వ్యాపారులదే బాధ్యత.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ :ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాంటి వ్యాపారులపై అవసరమైతే ఎస్మా (ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెన్స్ యాక్ట్) చట్టం కింద చర్యలు తీసుకోవాల ని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదులు రావడంతో ఆయన స్పందించారు. ఈ సమస్యలపై సంబంధిత అధికారులతో సోమవారం ఆయన మాట్లాడారు. రైతుల పంట కొనుగోళ్లలో మోసాలకు పాల్పడితే సహించేంది లేదని సిఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రైతులను గందరగోళానికి గురి చేయటం, వేధించటం వంటి ఘటనలపై కఠినం గా వ్యవహారించాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రైతుల ను ఇబ్బంది పెట్టవద్దని, ధాన్యం కొనుగోళ్లు, తరలింపు వెంట వెంటనే జరగాలని, ఎక్కడైనా జాప్యం జరిగితే వ్యాపారులదే బాధ్యత అని సిఎం హెచ్చరించారు. రాష్ట్రమంతటా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సిఎం సూచించారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లపై అంతగా దృష్టి సారించకపోవ డం, కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక వసతులు లేకపోవడం వల్ల అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. నిబంధనల సాకుతో నిర్వాహకు లు, మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని రైతులు వాపోతున్నారన్నారు. మరోవైపు ధాన్యం తరలించేందుకు కావల్సిన గోనె సంచుల కొరత, తూకం ఆలస్యంగా వేయడం,ధాన్యం తీసుకెళ్లేందుకు వాహనాలు లేకపోవడం వం టి కారణాలు రైతులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయని సిఎం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News