Wednesday, November 20, 2024

నిరుద్యోగులూ..విపక్షం ఉచ్చులో పడొద్దు పరీక్షలు రాయండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రూప్-1 విషయంలో ని రుద్యోగులు అపోహలు నమ్మొద్దని, పదేళ్లలో వాళ్లు నిరుద్యోగులను కనీసం పట్టించుకోలేదని, నిరుద్యోగులు వాళ్ల ఉచ్చులో పడొద్దని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ అ ధికారంలో ఉన్న 10 ఏళ్లపాటు ఉద్యోగాలు భర్తీ చేయకుం డా కాలయాపన చేసిందని, ఇప్పుడేమో పోటీ పరీక్షలను వాయిదా వేయాలని అంటోందని సిఎం రేవంత్ మండిపడ్డారు. ‘పోలీసు డ్యూటీ మీట్’ ముగింపు వేడుకలకు ము ఖ్యఅతిథిగా సిఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి యధాతథంగా జరుగుతాయని సిఎం రే వంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరీక్షలకు సిద్ధం కండి. 95 శాతం మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. మరో 5శాతం మంది డౌన్‌లోడ్ చేసుకోవాలని సి ఎం సూచించారు. ప్రతిపక్షాల మాయమాటలను నమ్మకం డి. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు.

మేం వచ్చాకే వేల ఉద్యోగాలు కల్పిస్తున్నామని రేవంత్ పే ర్కొన్నారు. అండగా నేనున్నా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ క మిషన్‌ను ప్రక్షాళన చేశామని ఆయన తెలిపారు. పదేళ్లుగా వాయిదాలు పడుతున్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేశాం, 15 వేల మంది పోలీస్ సిబ్బందిని కొత్తగా నియమించామ ని సిఎం రేవంత్ తెలిపారు.1,637 ఇంజనీరింగ్ పోస్టులు, 65 రోజుల్లోనే 11,067 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చే శామని సిఎం రేవంత్ తెలిపారు. నిరుద్యోగుల భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 564 గ్రూప్ 1 పో స్టుల నియామకాల కోసం మెయిన్స్ పరీక్షను సోమవారం నిర్వహించబోతున్నామని ఆయన తెలిపారు. ప్రతిపక్షాల ఉద్యోగాలు పోయాయి. వేలాది మంది నిరుద్యోగులకు ఉ ద్యోగాలు వచ్చాయి. గతంలో ఉన్న జీఓ 55 రద్దుచేసి గ్రూ ప్ 1 నోటిఫికేషన్ ఇచ్చామని ఆయన తెలిపారు. అదే సమయంలోనే జీఓ 29 తెచ్చామని, ఈ జీఓ ద్వారా రిజర్వేషన్లు ఖాళీల భర్తీ విషయంలో ఒక పోస్టు ఖాళీగా ఉన్న 1:50 పిలవాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. 31 వేల మందికి పైగా మెయిన్స్‌కు అర్హత సాధించారని, ఇప్పుడు 1:100 లెక్కన పిలవాలని ఆందోళన చేస్తున్నారని సిఎం రేవంత్ తెలిపారు. నోటిఫికేషన్‌లో ఇచ్చిన నిబంధనలను మధ్యలో మారిస్తే కోర్టులు ఊరుకుంటాయా? అని సిఎం రేవంత్ ప్రశ్నించారు.

గద్దర్‌ను నాలుగు గంటల పాటు ఎండలో
నోటిఫికేషన్ ఇచ్చే సమయంలోనే 1:100 కోరుకొని ఉంటే మీ ఆలోచనకు తగ్గట్టే ఇచ్చేవాళ్లమని సిఎం రేవంత్ తెలిపారు. రిజర్వేషన్ ప్రకారమే ఎంపిక చేస్తే వేలమంది ఎస్సీ, ఎస్టీలకు అవకాశం వచ్చిందని ఆయన తెలిపారు. రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేస్తుంటే కొంతమంది గందరగోళం సృష్టిస్తూ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కనీసం మీకు అపాయింట్‌మెంట్ అయినా ఇచ్చారా..? ప్రజా యుద్ధనౌక గద్దర్ సమస్యలు చెప్పుకోవడానికి వెళితే నాలుగు గంటలపాటు ఎండలో నిల్చోబెట్టిన నీచమైన చరిత్ర వాళ్లది సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 హాల్ టికెట్లు 95 శాతం మంది తీసుకున్నారు. ఇంకా తీసుకొని వారు హాల్ టికెట్లు తీసుకొని పరీక్షకు సన్నద్ధంకావాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు.

మీ భావోద్వేగాలతో బిఆర్‌ఎస్ ఆడుకుంటోంది
న్యాయస్థానాలు కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల విధానాన్ని సమర్ధించాయని సిఎం రేవంత్ పేర్కొన్నారు. మీ భావోద్వేగాలతో బిఆర్‌ఎస్ ఆడుకుంటోందని, వారి ఉచ్చులో పడొద్దని ఆయన తెలిపారు. ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని, అన్నగా తాను పరీక్షలు నిర్వహిస్తుంటే, వద్దు అని ఆందోళన చేస్తున్నారని, దీనిపై ఆలోచించాలని సిఎం రేవంత్ పేర్కొన్నారు. మీకు అవకాశాలు ఇవ్వడం కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఆందోళనలను విరమించి అపోహాలకు దూరంకావాలని ఆయన తెలిపారు. నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నప్పుడు ఉదారంగా వ్యవహరించాలని సిఎం అన్నారు. నిరుద్యోగులపై కేసులు పెట్టాల్సిన అవసరం లేదని, పొరపాటున కేసులు పెడితే ఉద్యోగాలు సాధించడంలో ప్రతిబంధకంగా మారుతాయని, నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న క్రమంలో కేసులు పెట్టవద్దని పోలీసులను ఆదేశిస్తున్నానని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

పోలీసు ఉద్యోగం భావోద్వేగంతో కూడుకుంది….
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకు స్ఫూర్తిని ఇచ్చేలా ‘పోలీసు డ్యూటీ మీట్’ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని సిఎం తెలిపారు. రాష్ట్ర ఏర్పాటులో పోలీసులది కీలకపాత్ర అని, రాష్ట్ర సాధనలో పోలీస్ కిష్టయ్య త్యాగం ఎప్పటికీ మరిచిపోలేమని ఆయన చెప్పారు. పోలీస్ ఉద్యోగం ఒక ఉద్యోగం మాత్రమే కాదని, అది ఒక భావోద్వేగంతో కూడుకున్నదని ఆయన తెలిపారు. పోలీస్ శాఖ గౌరవం పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట పెరుగుతుందన్నారు. చిన్న పొరపాటు జరిగినా అది ప్రభుత్వానికి చెడ్డపెరు తెస్తుందన్నారు. పోలీస్ సేవలు, త్యాగం వల్లే ప్రజలు నిర్భయంగా ఉండగలుగుతున్నారని ఆయన తెలిపారు. శాంతి భద్రతలు బాగుంటేనే ఆ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయని, అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ అభివృద్ధికి పోలీసులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.

50 ఎకరాల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్
పోలీసుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం తెలిపారు. 50 ఎకరాల్లో పోలీస్ సిబ్బంది పిల్లలకోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని సిఎం రేవంత్ తెలిపారు. వచ్చే అకాడమిక్ ఇయర్‌లో ఈ స్కూల్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిఎం రేవంత్ తెలిపారు. భవిష్యత్‌లో పోలీస్ స్కూల్‌లో చదివామని గర్వంగా చెప్పుకునేలా దానిని తీర్చిదిద్దుతామని, మొదటి విడతగా 5 నుంచి 8 వతరగతి వరకు మొదలు పెడతామని, ఆ తరువాత ఒక్కో తరగతిని పెంచుకుంటూ పోతామని ఆయన తెలిపారు. తెలంగాణ పోలీస్ దేశంలోని మిగతా రాష్ట్రాల పోలీస్ కు ఆదర్శంగా నిలవాలన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి సరఫరాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహారించాలని సిఎం రేవంత్ సూచించారు. సైబర్ క్రైమ్ ను నియంత్రించి, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ విషయంలో దోషులు ఎంతటి వారైనా విడిచిపెట్టొద్దని సిఎం రేవంత్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News