Sunday, January 19, 2025

ఒత్తిళ్లెన్ని వచ్చినా..ఆక్రమదారుల భరతం పడతాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/నార్సింగి : భగవద్గీత స్ఫూర్తితోనే అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నామని, ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులు అక్రమించిన వారి భరతం పడతామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధర్మం ఓడాలంటే యుద్ధం త ప్పదన్న కృష్ణుడి మాటలు తనకు స్ఫూర్తినిచ్చాయని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారం చెరువులను కాపాడుతున్నామని ఆయన తెలిపారు. మహానగరంలో చెరువులను చెరబట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని సిఎం రేవంత్ వెల్లడించారు. కోకాపేట్ అక్షయ పా త్ర ఫౌండేషన్ సమీపంలో హరేకృష్ణ హెరిటేజ్ టవ ర్ ఆధ్వర్యంలో అనంత శేషస్థాపన ఉత్సవంలో సిఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. అక్రమార్కుల నుంచి చెరువులను విముక్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. చెరువులు మనవాళికి జీవనాధారమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొందరు శ్రీమంతులు వాటిలో ఫాంహౌజ్‌లను నిర్మించారని సిఎం రేవం త్ అసహనం వ్యక్తం చేశారు. అక్రమార్కుల నుంచి చెరువులను విముక్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్య త అందరిపై ఉందన్నారు.

నిజాం ఆనాడే హైదరాబాద్‌ను లేక్ సిటీగా గుర్తించి గొలుసు కట్టు చెరువుల నిర్మాణాలు చేపట్టారని సిఎం రేవంత్ తెలిపా రు. కరువు వచ్చిన సమయంలో గండిపేట, ఉస్మా న్ సాగర్ హైదరాబాద్ దాహార్తిని తీర్చుతున్నాయ ని, కానీ, కొందరు ధనవంతులు చెరువుల పక్కనే ఫాంహౌస్‌లు కట్టుకొని, ఆ నాలాలు గండిపేటలో కలిపారని, ఇప్పుడు వాటిని తాగునీటిగా ఉపయోగించేందుకు ఇబ్బందిగా మారిందని సిఎం రేవంత్ తెలిపారు. అలాంటి అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ప్రజా ప్రతినిధిగా తాను విఫలమైనట్లేనని, అందుకే ఎవరు ఎంత ఒత్తిడి చేసినా మిత్రులకు ఫాంహౌజ్ లు ఉన్నా హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి, చెరువులను ఆక్రమించిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని సిఎం రేవంత్ అన్నారు. ఇందులో ప్రభు త్వ భాగస్వామ్యం ఉన్నవారు ఉండొచ్చు, సమాజా న్ని ప్రభావితం చేసే వారు ఉండొచ్చు, ఎవరిని ప ట్టించుకోనని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇది రాజకీయాల కోసమో నాయకులపై కక్ష సా ధింపుకోసం చేయడం లేదని,

భవిష్యత్ తరాల కో సం అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నామని సిఎం రేవంత్ వివరణ ఇచ్చారు. ప్రకృతి విధ్వంసం చేస్తే ప్రకృతి విలయం ఎలా ఉంటుందో చూస్తున్నామ ని, ఇప్పటికే చెన్నై ఉత్తరాఖండ్, వయనాడ్‌లలో ఏం జరిగిందో చూశామని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత మన పై ఉందని, ఇందులో భాగంగానే చెరువులను రక్షణను ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని, ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులు అక్రమించిన వారి భరతం పడతామని సిఎం హెచ్చరించారు. ఇక హ రే రామ హరే కృష్ణ ట్రస్ట్ ఏ కార్యక్రమం చేపట్టినా దానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామని, అలాగే పేదల కోసం చేపట్టే పథకాల్లో ట్రస్ట్ సహకారం అందించి, తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మీ వంతు సహకారం అందించాలని రేవంత్ రెడ్డి కోరారు.

విద్య, వైద్యానికి ప్రభుత్వ ప్రాధాన్యం
విద్య, వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యతనిస్తుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ధ్యాన కేంద్రాన్ని నిర్మిస్తున్నారని నిర్వాహకులను సిఎం రేవంత్ రెడ్డి ప్రశంసించా రు. ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవానికి రావడం అ దృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. స్థలదాతలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య
అతిథిగా రావడం తన జన్మ సుకృతమని సిఎం రేవంత్ తెలిపారు. కాంక్రీట్ జంగిల్ లో ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించేందుకు ఇక్కడ హెరిటేజ్ టవర్ నిర్మించడం గొప్ప విషయమన్నారు. ఈ టవర్ 430 అడుగుల ఎత్తు నిర్మితం కావడం రాష్ట్రానికి గర్వకారణమని 36 లేదా 40 నెలల్లో ఈ టవర్ నిర్మాణం పూర్తి అవుతుందని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

సమాజంలో వ్యక్తులకు స్ఫూర్తినిచ్చేలా హెరిటేజ్ టవర్ నిర్మాణం జరగాలని సిఎం రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. హెరిటేజ్ టవర్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించాలని సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు కోకాపేట్ ఆర్థికక్షేత్రం అని ఆయన అభివర్ణించారు. హెరిటేజ్ టవర్ నిర్మాణానికి అగర్వాల్ ఆరు ఎకరాలు భూదానం చేశారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా 22 లక్షల స్కూళ్లకు భోజనం అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న చెరువులు అన్యాక్రాంతం కాకుండా సిఎం చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు కొనియాడారు. రేవంత్‌రెడ్డి చేస్తున్న గొప్ప కార్యక్రమానికి పెద్దల ఆశీర్వాదాలు ఉండాలని శ్రీధర్‌బాబు అకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News