Wednesday, January 22, 2025

ఆడబిడ్డల ఆకాంక్షలను నెరవేర్చడానికి మహాలక్ష్మీ పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది

- Advertisement -
- Advertisement -

ఆడబిడ్డల ఆకాంక్షలను నెరవేర్చాలన్న సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మీ పథకాన్ని ప్రకటించిందని సిఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ మహాలక్ష్మీలను చూస్తుంటే ఆ పథకం ఉద్దేశం నెరవేరుతోందన్న విషయం అర్థమవుతోందన్నారు. చాలా సంతోషం ఆ పిల్లలు భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని, వారి లక్ష్యాలను చేరాలని సిఎం రేవంత్ ఆకాంక్షించారు. మహాలక్ష్మిపథకాన్ని ఉపయోగించుకొని పిల్లలు గ్రౌండ్‌కు వెళ్లి గేమ్స్ నేర్చుకుంటున్నామని మాధవరపు రమా లక్ష్మీ(టిజిఎస్‌ఆర్టీసీ కండక్టర్) ఎక్స్ వేదికగా సిఎం రేవంత్ రెడ్డికి ట్వీట్ చేశారు.దీంతోపాటు మహాలక్ష్మి పథకం ఆడపిల్లలు చాలా ధైర్యంగా ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుందని, మీకు ధన్యవాదాలు సార్ అంటూ వారు బస్సులో దిగిన ఫొటోను సిఎంకు షేర్ చేశారు. దీంతో ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News