Wednesday, November 13, 2024

అన్ని మతగ్రంథాలదీ అభివృద్ధి మంత్రమే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : శాంతి, కరుణ, సోదరభావాన్ని చాటి చెప్పే మహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రవక్త బోధనలైనా, భగవద్గీత, బైబిల్ సారాంశాలైనా మనకు చెప్పేది మంచి విషయాలే అని, విద్వేషాలు వదిలి శాంతియుతం గా జీవించడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రస్తుత అధ్యక్షుడు, ప్రముఖ ఇస్లాం పండితుడు, రచయిత మౌ లానా ఖలీద్ సైఫుల్లా రహ్మాని రచించిన ‘ప్రాఫెట్ ఫర్ ద వరల్డ్‘ పుస్తకాన్ని ము ఖ్యమంత్రి ఆవిష్కరించారు. ముహమ్మద్ ప్రవక్త బోధనలపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టమని ముఖ్యమంత్రి రేవంత్ ఈ సం దర్భంగా అన్నారు. విద్వేష భావనల నుంచి దేశాన్ని, పోరాడి సాధించుకున్న స్వేచ్ఛను కాపాడుకోవాలంటే ప్రవక్త చెప్పిన శాంతి మార్గమే ఆచరణీయమని పే ర్కొన్నారు. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు నగరానికి చెం దిన వ్యక్తి కావడం మనకు ఎంతో గౌరవం అన్నారు.

రాజకీయాలు, ఎన్నికల్లో పరస్పరం తలపడినా, అభివృద్ధి విషయంలో మాత్రం అందరితో కలిసి పని చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ పిలుపునిచ్చారు. మూసీ, ఈసా నదుల ప్రక్షాళన పనుల్లో స్థానిక ఎంఐఎం పార్టీ సహకారం తీసుకుంటున్నామని గుర్తుచేశారు. కులమతాలకు అతీతంగా పేదల సంక్షేమం, అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందని తెలిపారు. రాబోయే 10 సంవత్సరాలు ప్రజా ప్రభుత్వానికి అన్ని వర్గా లు అండగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ కో రారు. గతంలో హైదరాబాద్ ఎంపిగా అసదుద్దీన్ ఒకవైపు, మరో వైపు తాను ఎంపీగా ఉన్నామని, ఆయన పలుమార్లు కాంగ్రెస్‌ను విమర్శించినా సంతోషించేందన్నారు. ఎందుకంటే విమర్శలు చే సిది నా సోదరుడే అనుకునేవాడినని రేవంత్ అ న్నారు. పార్లమెంట్‌లో పేదల తరపున మాట్లాడే వారు తక్కువ అయ్యారని, జైపాల్‌రెడ్డి లాంటి నే తలు లేకపోవడం లోటేనన్నారు. పేదల తరపున మాట్లాడడం, కొట్లాడుతున్న వారు అసదుద్దీన్ ఒ వైసి ఒకరు అని రేవంత్ ప్రశంసించారు.

ఎన్నికల సమయంలోనే అసద్ భాయ్‌తో కొట్లాట అని, మి గతా సమయం అంతా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మేలు చేయడానికే పనిచేస్తామని అన్నా రు. మూసీ నదిలోకి హైదరాబాద్ నగరంలోని చె త్త అంతా వస్తోందని, దాన్నిప్రక్షాళన చేసేందుకు మజ్లిస్ పార్టీ సహకారం కూడా తీసుకుంటున్నామని అన్నారు. కార్పొరేట్ రంగంలో, వ్యాపారా ల్లో మన వాళ్లు అగ్రగామిగాఎదుగుతున్నారన్నా రు. పేదలకు డబుల్‌బెడ్రూం ఇళ్లనుఇవ్వనున్నామ ని చెప్పారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రావు ప్రభుత్వాలను రెండు సార్లు ప్రజలు గె లిపించారు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా రెండోసారిఅవకాశం వస్తుందని నమ్ముతున్నట్లు సిఎం ధీమా వ్యక్తం చేశారు. ఆరాంఘర్‌లోని మెట్రో క న్వెన్షన్‌లో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమం లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపి అసదుద్దీన్, పండితులు, ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News