Sunday, December 22, 2024

వద్దని చెప్పినా వచ్చాడు

- Advertisement -
- Advertisement -

సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ రోడ్ షో నిర్వహించాడు ఆయనను చూసేందుకు అభిమానులు
పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది పరిస్థితి చేయిదాటిందని ఆయనకు చెప్పిన పోలీసులు అయినా
సినిమా పూర్తయ్యేంత వరకూ థియేటర్‌లోనే ఉంటానని పోలీసులకు స్పష్టం చేసిన హీరో
తొక్కిసలాటలో మహిళ చనిపోయారని అల్లుకు తెలిపిన అధికారులు థియేటర్ నుంచి వెళ్లకపోతే
ఠాణాకు తరలిస్తామని హెచ్చరిక దీంతో థియేటర్ నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం
చేస్తూ వెళ్లిపోయిన అర్జున్ ఘటనలో పోలీసుల వైఫల్యం లేదు సినిమాలు తీసి డబ్బులు
సంపాదించుకుంటే ఓకే.. కానీ ప్రజల ప్రాణాలు పోతుంటే ఊరుకోం ప్రత్యేక రాయితీలివ్వం
ఇకపై బెన్‌ఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదు నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఇలాంటి
సంఘటనలను ఉపేక్షించను సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్

మన తెలంగాణ/హైదరాబాద్ : సంధ్య థియేటర్ ఘటన పై పోలీసుల వైఫల్యం లేదని, హీరో, సెలబ్రిటీలు బెనిఫిట్ షోకు రావద్దని పోలీసులు చెప్పినా వినలేదని ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం శాసనసభలో రైతు భరోసాపై చర్చ జరుగుతుండగా ఎంఐఎం శాసనసభా ప క్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సంధ్య థియేటర్ ఘటనపై ప్ర భుత్వం ప్రకటన చేయాలని కోరారు. దీనిపై ముఖ్యమం త్రి స్పందిస్తూ ఆ రోజు జరిగిన విషయాన్ని వెల్లడించారు. సినిమాలు తీసుకోండి, వ్యాపారం చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి, ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రో త్సాహకాలు తీసుకోండి, షూటింగ్‌కు సంబంధించి ప్ర త్యేక అనుమతులు కూడా తీసుకోండి కాని ప్రజల ప్రా ణాలు పోతుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని సినిమా ప్రముఖులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. తాను కుర్చీలో ఉన్నంత వ రకు ఇలాంటి ఘటనలు ఉపేక్షించేది లేదని హెచ్చరించా రు.

ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే ప్రత్యేక మినహాయింపులు ఉండవని తేల్చి చెప్పారు. సంధ్య థి యేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఈనెల 4న పుష్ప -2 విడుదలవుతుందని, అదే రోజు హీరో, హీరోయిన్, సినీ ని ర్మా ణ సిబ్బంది వస్తారని బందోబస్తు కావాలని సంధ్య థి యేటర్ యాజమాన్యం ఈనెల 2న చిక్కడపల్లి పిఎస్‌లో ద రఖాస్తు చేశారని సిఎం తెలిపారు. 3న థియేటర్ రాసిన లేఖకు పోలీసులు రాతపూర్వక సమాధానం ఇచ్చారన్నారు. సంధ్యా థియేటర్‌కు వెళ్లి, రావడానికి ఒకే మార్గం ఉందని, చుట్టు పక్కల ఇతర థియేటర్లు, రెస్టారెంట్లు ఉన్నాయని అందులో తెలిపారని వివరించారు. సంధ్య థియేటర్ పరిసరాల పరిస్థితుల దృష్ట్యా సెలబ్రిటీలకు భద్రత ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారని సిఎం వెల్లడించారు. వచ్చే జనాలను నియంత్రించడం సాధ్యం కాదని చెప్పారని పేర్కొన్నారు.

పోలీసులు వద్దన్నా హీరో వచ్చారు అయినా రాత్రి 9.30 గంటల సమయంలో అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చారని, ఆర్‌టిసి క్రాస్‌రోడ్ వద్ద నుంచే తన వాహనం రూఫ్ టాప్ నుంచి చేతులు ఊపుతూ ర్యాలీగా సంధ్య థియేటర్‌కు చేరుకున్నారని తెలిపారు.
నేరుగా థియేటర్‌కు వచ్చి సినిమా చూసి వె ళ్లిపోతే ఈ ఘటన జరిగేదే లేదో తనకు తెలియదని సిఎం చెప్పారు. క్రాస్ రోడ్డు చౌరస్తా ముందే రోడ్ షో చేస్తూ థి యేటర్‌కు రావడంతో ఆ సమయంలో చుట్టూ ఉన్న ఏడెనిమిది థియేటర్లలో ఉన్న అభిమానులు అక్కడికి చేరుకున్నారని తెలిపారు. హీరో కారు లోపలకు పంపించేందు కు గేటుతెరిచారని,దీంతో ఒక్కసారిగా వందల సంఖ్య లో అభిమానులందరూ థియేటర్ లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారన్నారు. ఆ సమయంలో జరిగిన ఘటనలో రేవతి చనిపోయారు. హీరోను చూడాలని, కలవాలని అభిమానులు రావడంతో హీరోకు సెక్యూరిటీగా ఉన్న ప్రై వేట్ సిబ్బంది నెట్టివేయడంతో తోపులాట జరిగిందని ఈ ఘటనలో తల్లి రేవతి చనిపోయిందని, కుమారుడు చికిత్స పొందుతున్నాడని సిఎం తెలిపారు. ఘటన జరిగిన వెం టనే తల్లి, కుమారుడిని రక్షించేందుకు పోలీసులు య త్నించారని రేవంత్‌రెడ్డి తెలిపారు.ఈ తోపులాటలో ఆ మె కుమారుడికి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని, ప్రస్తుతం ఆ సుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఈ ఘటనపై పో లీసుల దర్యాప్తు కొనసాగుతోందని ముఖ్యమంత్రి చెప్పారు.

ఎసిపి చెప్పినా వినలేదు
పరిస్థితి చేయిదాటి పోయింది, ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని అల్లు అర్జున్‌కు చెప్పాలని పోలీసులు ప్ర యత్నించారని, కాని థియేటర్ యాజమాన్యం అల్లు అర్జు న్ వద్దకు వెళ్లనీయకుండా పోలీసులను బ్లాక్ చేశారని ము ఖ్యమంత్రి తెలిపారు. ఎట్టకేలకు ఎసిపి వెళ్లి అల్లు అర్జున్‌కు పరిస్థితి వివరించారని, శాంతిభద్రతల సమస్య వ స్తుందని, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పారని, అయి నా సినిమా పూర్తయ్యేంతవరకు ఉంటానని హీరో చెప్పినట్లు కమిషనర్ తనతో చెప్పారని సిఎం పేర్కొన్నారు.
‘థియేటర్ బయట ఉన్న పరిస్థితి దృష్ట్యా డిసి పి నేరుగా హీరో వద్దకు వెళ్లి బయట ఒకరు చనిపోయా రు, మీరు వెళ్లిపోవాలని, మీరు వెళ్లకపోతే పిఎస్‌కు తీసుకెళ్లాల్సి వస్తుందని హీరోకు చెప్పారన్నారు. దీంతో రాత్రి 12 గంటలకు థియేటర్ నుంచి బయటకు వచ్చాడని, త ల్లి చనిపోయిందని, బాలుడు చావు బతుకుల మధ్య ఉ న్నాడని పరిస్థితి బాగాలేదని చెప్పినా వాహనంపైకి ఎక్కి చేతులు ఊపుకుంటూ వెళ్లాడని తెలిపారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేసినట్లు – రేవంత్ రెడ్డి తెలిపారు.

హీరోను అరెస్టు చేస్తే తిట్టారు
పోలీసులు హీరో ఇంటికి వెళ్లారు. కేసు నమోదు అయిందని హీరోకు చెప్పారు. ఘటనలో ఏ11గా కేసు నమోదు అయిందని చెప్పారు. పోలీసుల పట్ల అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించారు అని సిఎం సభలో చెప్పారు. విచారణలో భాగంగా హీరోను పోలీసులు పీఎస్‌కు తీసుకెళ్లారని తెలిపారు. హీరోను పిఎస్‌కు తీసుకెళ్తే కొందరు నేత లు తనను తిడుతూ పోస్టులు పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. రూ.30 వేల ఉద్యోగం చేసుకునే వ్యక్తి రూ.12 వేలతో 4 టికెట్లు కొని సినిమాకు వెళ్లారని అన్నారు. కు మారుడు అల్లు అర్జున్ అభిమాని అని సినిమాకు తీసుకెళ్లారని వివరించారు.తొక్కిసలాటలో మహిళ చనిపోయి, కుమారుడు చావు బతుకుల్లో ఉన్నా 11 రోజుల వరకు బాధిత కుటుంబం వద్దకు హీరో,

నిర్మాత వెళ్లలేదని సిఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికి త్స పొందుతన్న పిల్లాడిని పరామర్శించేందుకు వెళ్ళలేదన్నారు. ఇది ఏ రకమైన మానవత్వం అని సిఎం ప్రశ్నించారు. మానవత్వం లేని వారిని పోలీసులు అరెస్టు చేశార ని తెలిపారు. ఆ హీరో దైవస్వరూపుడు, ఆయనను ముట్టుకుంటారా అంటూ ఒక నేత ట్వీట్ చేశారని ధ్వజమెత్తా రు. ఉద్యమ సమయంలో షూటింగ్‌లు జరగవద్దన్న నేత లు, ఆ హీరోను భగవత్ స్వరూపుడు అన్నారని ధ్వజమెత్తారు. చనిపోయిన వారి ప్రాణాలకు విలువ లేకుండా చా వుకు కారణమైన వారిని పిఎస్‌కు తీసుకెళ్తే తప్పుపడుతున్నారని దుయ్యబట్టారు. ఈ ఘటనలో ప్రభుత్వాన్ని బద నాం చేయడానికి ప్రయత్నించారన్నారు.

కాలు పోయిందా..కన్ను పోయిందా.. దేనికి మీ పరామర్శ..?
బెయిల్‌పై విడుదలైన నటుడిని పరామర్శించేందుకు మాత్రం సినీ ప్రముఖులు అతని ఇంటి వద్దకు క్యూ కట్టారని, చావు బతుకుల్లో ఉన్న బాలుడిని పరామర్శించేందుకు మాత్రం వెళ్ళలేదని ఇది ఏ రకమైన మానవత్వమని ఆయన ప్రశ్నించారు. అల్లు అర్జున్ కాలు పోయిందా..? కన్ను పోయిందా..? దేనికి మీ పరామర్శ అని ఆయన సినీ ప్రముఖులనుద్దేశించి ప్రశ్నించారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి లోబడే తమ ప్రభుత్వం నడుచుకుంటుందని సిఎం చెప్పారు. ప్రాణాలు బలి తీసుకున్న వారిని ఏమి అనొద్దంటే ఇదేం న్యాయం, సినీ, రాజకీయ ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఏదైనా చేస్తారా అని సిఎం ప్రశ్నిరరంచారు.
మహిళ చనిపోయిందని చెప్తే.. సినిమా హిట్ అయినట్లేనన్నారు
ఒక సినీ స్టార్ థియేటర్‌కు వెళ్ళినపుడు చోటు చేసుకున్న తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని శాసనసభలో అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని హిరోకి చెపితే ఇక సినిమా హిట్ అయ్యిందని ఆ హీరో అన్నట్లు తెలిసిందని ఇదేమి మానవత్వమని అక్బరుద్దీన్ అన్నారు అసలు ఆ ఘటన సందర్భంగా ఏం జరిగిందో ప్రభుత్వం తెలుపాలని అక్బరుద్దీన్ కోరగా సిఎం రేంవత్ రెడ్డి పై విధంగా స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News