Wednesday, February 5, 2025

మేం ఇస్తాం.. మీరు సిద్ధమా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం సీట్లను ఇస్తామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇది మా కమిట్‌మెంట్ అని ఆయన పేర్కొన్నారు. మరీ బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు బిసిలకు 42 శాతం సీట్లను ఇస్తా యా అని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మే రకు అసెంబ్లీలో తాము తెలంగాణలో చేసిన వి ధంగా దేశవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్యా, రాజకీయ, కుల సర్వే ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. ఈ తీ ర్మానాన్ని దేశంలోని వివిధ కులాల సంబంధిత స్థితిగతులను అర్ధం చేసుకోవడానికి, తెలంగాణ లో నిర్వహించిన విధంగానే దేశవ్యాప్తంగా చేపట్టాలని కేంద్రానికి సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. దేశ స్వాతంత్య్రం నాటి నుంచి ఎదురు చూస్తున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణ ప్రభు త్వం మొదటిసారి ఆచరించడం ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయమని ఆయన పేర్కొన్నారు. తమ ప్ర భుత్వం వెనుకబడిన

తరగతులు (బిసి), షెడ్యూల్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్ తెగలు (ఎస్టీ)లతో పాటు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
రాజ్యాంగ సవరణ జరగాలి
మంగళవారం కులగణన సర్వేపై శాసనసభలో చర్చ జరిగిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలన్నారు. కానీ, అలా అవకాశం లేకపోతే పార్టీ పరంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బిసిలకు 42 శాతం సీట్లు ఇస్తుందని ఈ వేదిక నుంచి తాను మాట ఇస్తున్నానన్నారు. ఈ విషయంలో తాను పిసిసి అధ్యక్షుడికి మాట ఇచ్చే ఈ సభకు వచ్చానని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. చట్టబద్ధం అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా ఇద్దామని,

రాజకీయంగా, నైతికంగా కట్టుబడి 42 శాతం బలహీన వర్గాలకు సీట్లు ఇవ్వాలని, దీనికి ఈ రెండు పార్టీలు సిద్ధమా అని అసెంబ్లీ వేదికగా సిఎం రేవంత్ రెడ్డి వారికి చాలెంజ్ విసిరారు.
సర్వేలో పాల్గొనని శాసన సభ్యులకు మాట్లాడే అర్హత లేదు
కులగణన సర్వేలో పాల్గొనని శాసన సభ్యులకు చర్చలో మాట్లాడే అర్హత లేదని, సర్వేలో పాల్గొన్న వారికే మైక్ ఇవ్వాలని, సర్వేలో పాల్గొనని సభ్యులకు మైక్ ఇవ్వవద్ధని స్పీకర్‌కు సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కులగణన సర్వేలో కెసిఆర్, కెటిఆర్, హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, పద్మారావు, డికె అరుణలు సర్వేలో పాల్గొనలేదన్నారు.

సర్వే ప్రశ్నపత్రంలో 5వ పేజీలో భూముల వివరాలు చెప్పాల్సి వస్తుందని భయపడి సర్వేకు కెసిఆర్ కుటుంబం దూరంగా ఉందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా వారంతా సర్వేలో వివరాలు అందించాలని ఆయన కోరారు. సర్వేలో అడిగిన ప్రశ్నలతోనే కొంతమంది సర్వేకు దూరంగా ఉన్నారని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చెప్పారని సిఎం అన్నారు. ఆయన అడిగినట్లుగా 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలన్నారు.
తప్పుల తడక బిఆర్‌ఎస్ సమగ్ర కుటుంబ సర్వే నివేదిక

2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు బిసిలు 61 శాతం (హిందూ బిసి 51శాతం+ముస్లిం బిసిలు 10 శాతం)అని, ఇప్పుడు బిసిల సంఖ్య కులగణన సర్వేలో 46 శాతం ఎలా తగ్గిందన్న కెటిఆర్ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. తాము చేసిన సర్వేలో బిసి జనాభా 56.33 శాతంగా వచ్చిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం, అవగాహన రాహిత్యంతో సభలో మాట్లాడం సరికాదని కెటిఆర్‌పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తప్పుల తడక బిఆర్‌ఎస్ సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ప్రజల ముందు, సభ ముందు పెట్టకుండా లిమ్కా బుక్ రికార్డుకు అందించిన ఘనులని రేవంత్ విమర్శించారు. ఎంతకాలం ప్రజలను బిఆర్‌ఎస్ మోసం చేస్తుందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బిసిలకు రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో కులగణన ప్రక్రియను నిర్వహించామని ఆయన స్పష్టం చేశారు. కులసర్వే సారాంశాన్నే తాను సభలో ప్రవేశపెట్టానని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

కులసర్వే మొత్తం నాలుగు భాగాలు….
కులసర్వే మొత్తం నాలుగు భాగాలుగా ఉందని, మొదటి మూడు భాగాలను సభలో ప్రవేశపెట్టామని, నాలుగో విభాగంలో పౌరుల వ్యక్తిగత సమాచారం ఉందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యక్తిగత గోప్యత చట్టం కారణంగా నాలుగో భాగం ప్రవేశపెట్టలేదని ఆయన అన్నారు. కులగణన నివేదికలో నాల్గొ విభాగంలో ప్రైవసీ వివరాలు ఉన్నందున తాము నివేదిక బయట పెట్టడం లేదన్నారు. ఆ వివరాలు కాకుండా ఏ వివరాలు అడిగినా స భ్యులకు అందిస్తామన్నారు. 1.12శాతం మాత్రమే జ నాభా వృద్ధి రేటు ఉందనిజనాభా పెరుగుదల తక్కువగా కనిపిస్తుందని సిఎం రేవంత్ తెలిపారు. అలాగే సర్వేలో పాల్గొనని వారి లెక్కలు కూడా రాలేదని ఆయన గుర్తు చేశారు. కులగణన సర్వేలో బిసిలు, మైనార్టీల జనాభా శాతం పెరిగిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనిపై సభ్యులకు వివరాలు అందిస్తామన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ఎందుకు జనాభా గణన చేపట్టలేదని, బిజెపి సభ్యులు జనాభా లెక్కించమని మోడీని ఎందుకు అడగడం లేదని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

శంకర్ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు….
పాయల్ శంకర్ ప్రజల్లో అపోహలు సృష్టించేలా మాట్లాడుతున్నారని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా లెక్కలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. ఆ సర్వే నివేదికలో జనాభా లెక్కలపై తేడాలు ఉన్నాయని సిఎం వెల్లడించారు. సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ప్రకారం బిసి జనాభా 51 శాతంగా పేర్కొన్నారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. తాము చేసిన తాజాగా సర్వే నివేదిక ప్రకారం బిసి జనాభా 56 శాతానికి పెరిగిందన్నారు. శాస్త్రీయంగా చేసిన సర్వే ప్రకారం బిసి జనాభా పెరిగినట్లు తేలిందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే నివేదిక అఫీషియల్ డాక్యుమెంటా? కాదా? అన్నది చెప్పాలని బిఆర్‌ఎస్‌ను ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు.

సర్వే ప్రకారం కులగణన వివరాలు ఇలా…
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే ప్రకారం ఎస్సీలు 61,84,319 (17.43 శాతం), బిసిలు (ముస్లిం మైనారిటీ మినహా) 1,64,09,179 (46.25 శాతం), ఎస్టీలు 37,05,929 (10.45 శాతం), ముస్లిం మైనారిటీలు 44,57,012 (12.56 శాతం) మంది, ముస్లిం మైనార్టీల్లో బిసిలు 35,76,588 (10. 08 శాతం), ముస్లిం మైనార్టీల్లో ఓసీలు 8,80,424 (2.48 శాతం), ముస్లిం మైనార్టీలు మినహా ఓసీలు 47,21,115, (13.31 శాతం), ఓసీలు 56,01,539, (15.79 శాతం) రాష్ట్రంలో ఉన్నారని సిఎం తెలిపారు.

సర్వేపై ఏకంగా 12 సార్లు సమీక్ష చేశాం
కులగణనలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కులగణనలో తప్పుడు తడకగా ఉందంటూ విపక్షాలు ఆరోపిచడంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన అన్నారు. సర్వేకు ముందు పలు రాష్ట్రాల్లో అధికారులు పర్యటించారని ఆయన తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో లోటుపాట్లను గుర్తించి సరి చేశామని సభకు సిఎం తెలిపారు. సర్వేపై ఏకంగా 12 సార్లు సమీక్ష నిర్వహించి పకడ్బందీగా రూపొందించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి 150 ఇళ్లను ఒక బ్లాక్‌గా గుర్తించి సర్వే చేపట్టామని ఆయన తెలిపారు. అన్ని శాఖల సిబ్బందిని సర్వేలో భాగస్వాములను చేశామన్నారు. ముందుగా స్టిక్కర్లు అంటించి సర్వే చేయాల్సిన ఇళ్లను గుర్తించామని సిఎం పేర్కొన్నారు. సర్వేలో పాల్గొనే సిబ్బందికి అనేక సార్లు శిక్షణను ఇచ్చామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి ఈ సర్వే ఓ మార్గదర్శిగా మారుతోందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. జనగణన కంటే పకడ్బందీగా కులగణన చేశామన్నారు.

రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించామని, ఒక ఎన్యుమరేటర్ రోజుకు 10 ఇళ్ల కంటే ఎక్కువ సర్వే చేయలేదన్నారు. 8 పేజీలతో ఉన్న ప్రశ్నాపత్రంలో సమగ్ర వివరాలు నమోదు చేశామని, మొత్తంగా రూ. 125 కోట్లు ఖర్చు చేసి సర్వే ద్వారా సమగ్ర వివరాలు సేకరించామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
50 రోజుల పాటు సర్వే కొనసాగింది
వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసమే ఈ కులగణన చేపట్టామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందులో భాగంగా సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేను సభలో ప్రవేశపెడుతున్నామని సిఎం రేవంత్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను నిర్వహించామని సిఎం పేర్కొన్నారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలను అధ్యయనం చేశామన్నారు. మొత్తం 75 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ సర్వే నిర్వహించామని సిఎం పేర్కొన్నారు. నవంబర్ 9వ తేదీ నుంచి 50 రోజుల పాటు సర్వే కొనసాగిందని సిఎం పేర్కొన్నారు. ఏడాది క్రితం సర్వే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని, సరిగ్గా ఏడాది తరువాత సర్వే నిర్వహించి నివేదికను అసెంబ్లీ ముందు ఉంచామన్నారు.

3.54 కోట్ల మంది సర్వేలో భాగస్వామ్యం
రాష్ట్రంలో 3.54 కోట్ల మంది ప్రజలది సర్వే నిర్వహించామని, 96.9 శాతం కుటుంబాలు ఈ సర్వేలో భాగస్వామ్యం అయ్యాయని సిఎం రేవంత్ వివరించారు. రాష్ట్రంలో ఏ, బి, సి, డి, ఈ వర్గాల్లో ఉన్న బిసిల శాతం 56.33 శాతమని సిఎం తెలిపారు. 2021 జనాభా లెక్కలను కేంద్రప్రభుత్వం ఇంకా ఎందుకు చేపట్టలేదని, దేశంలో 1871 నుంచి క్రమం తప్పకుండా జనాభా లెక్కలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. సమగ్ర సర్వే నివేదికను ఒక కుటుంబం ఎందుకు దాచిపెట్టుకుందని ఆయన అన్నారు.
రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం….
బిసి లెక్కలు తేల్చి వారికి అవకాశాలు కల్పిస్తామని రాహుల్ గాంధీ పాదయాత్రలో హామీ ఇచ్చారని రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తాము కులగణన చేపట్టామని సిఎం రేవంత్ అన్నారు. మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో కమిటీ వేసి ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లామని సిఎం తెలిపారు. కర్ణాటక, బీహార్‌లలో చేసిన వివిధ సర్వేలను అధ్యయనం చేశామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News