Wednesday, February 5, 2025

వర్గీకరణకు త్వరలో చట్టబద్ధత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం లో ఎస్సీల వర్గీకరణ అంశానికి త్వరలో చట్టబద్ధత కల్పిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు రాకుండా ఉం డేందుకు వీలుగా చట్టబద్ధ్దత దోహదం చే స్తుందన్నారు. ఆ దిశగా తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణలోని ఉప కులాలలో రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు ఇస్తామని తె లిపారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫార్సు చేసిన క్రిమిలేయర్‌ను తిరస్కరించినట్లు సిఎం చెప్పారు. మంగళవారం శాసనసభలో ఎస్సీ వర్గీకరణ నివేదికపై జరిగిన చర్చలో పలువురు మం త్రులు,

ఎంఎల్‌ఎలు పాల్గొని ప్రసంగించిన అనంతరం చివరిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. వర్గీకరణకు మద్దతు ప్రకటించిన అందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్పీకర్ ప్రసాద్‌కుమార్ శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 4కు తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత ఉందని తెలిపారు.

2024 ఫిబ్రవరి 4న ఎస్సీ వర్గీకరణ చేయాలనే నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. తిరిగి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ నివేదికను కేబినెట్ ఆమోదించింది సభ ముందుకు తీసుకొచ్చామని వివరించారు. దశాబ్దాల జటిలమైన సమస్యకు పరిష్కారం లభించిన ఫిబ్రవరి 4ను తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా గుర్తించుకుందామని తెలిపారు. వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన వారికి నివాళులు అర్పిస్తున్నామని, వారి ఆశయాలను ప్రజా ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందని అన్నారు.

ఇకమీదట వర్గీకరణకు ఎవరూ ఎలాంటి ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదని, గతంలో అసువులు బాసిన వారికి నివాళులర్పిస్తున్నట్లు సిఎం పేర్కొన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేసేందుకు అవసరమైన సహకారం అందిస్తామని అన్నారు.

మూడు గ్రూపులుగా 59 కులాలు
ఎస్సీల్లోని 59 కులాలను ఒకటి, రెండు, మూడు గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫారసు చేసింది. ఎస్సీ జనాభా ప్రాతిపదికన గ్రూప్ -1 కింద 15 ఉప కులాలను గుర్తించి వారికి 1 శాతం, గ్రూప్ 2 కింద 18 ఉప కులాలను గుర్తించి వారికి 9 శాతం, గ్రూప్ – 3 కింద 26 ఉప కులాలకు గాను 5 శాతం మేరకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఏకసభ్య కమిషన్ సిఫారసులను మంత్రిమండలి యదాతథంగా ఆమోదించింది. షెడ్యూల్డు కులాల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సిఫారసులను పరిశీలించిన ప్రభుత్వం వాటిల్లో మూడింటిని ఆమోదించడంతో పాటు క్రీమీలేయర్ ప్రతిపాదనను తిరస్కరిస్తూ ప్రభుత్వం

నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ ఉప కులాల వర్గీకరణ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించింది.
అందరికి కృతజ్ఞతలు
అంతకు ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ వర్గీకరణకు మద్దతు ప్రకటించి మాట్లాడిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి వర్గ సహచరులు, ప్రతిపక్షాలు కెటిఆర్, కూనంనేని, పాయల్ శంకర్ తదితరులు మాట్లాడిన అందరికి కులగణన, వర్గీకరణకు మద్దతు తెలిపినందుకు అన్ని సామాజిక వర్గాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. జఠిల సమస్యకు ఈ సభ ద్వారా పరిష్కరించామని అన్నారు. సభను సజావుగా జరిపారని స్పీకర్‌ను కొనియాడారు.

తాము అమలు చేయడమే కాకుండా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జనాభా లెక్కల్లో కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తామని అన్నారు. బలహీన వర్గాల కులగణన విషయంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందపి తెలిపారు. ప్రత్యేకించి శాసనసభను అద్భుతంగా నిర్వహించిన స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
సభ నుంచి బిఆర్‌ఎస్ వాకౌట్
తమ పార్టీ తరపున ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ప్రకటించిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే,

మాజీ మంత్రి కెటిఆర్ బిసిలకు రాష్ట్రంలో తీవ్ర అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. శాసనసభలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై జరిగిన చర్చలో పాల్గొన్న కెటిఆర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ తరఫున గతంలోనే సంపూర్ణ మద్దతు ఇచ్చామని తెలిపారు. అలాగే నాలుగు కోట్ల మంది ప్రజల తరపున కొట్లాడిన కృష్ణమాదిగను, మాదిగ ఉద్యమానికి కారకులైన అందరిని, ప్రజా సంఘాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజా సంఘాల ఉద్యమానికి కెసిఆర్ ఆనాడు అండగా నిలబడ్డారని గుర్తు చేస్తూ అయితే తాము అడ్డుకున్నట్లు కుయుక్తులతో మాట్లాడొద్దని అన్నారు.. దీక్ష దివస్ సందర్భంగా ఇదే శాసనసభలో వర్గీకరణకు కెసిఆర్ తీర్మానం చేశారని చెబుతూ ఆనాటి తీర్మానాన్ని చదివి వినిపించారు. రాజ్యాంగ సవరణ చేసైనా చేయాలని తీర్మానం చేశామని, కడియం శ్రీహరితో కలిసి అప్పటి ప్రధాని నరేంద్రమోడీని కలిసి నేరుగా ఆ తీర్మానం కాపీని అందించిన ఘనత కెసిఆర్‌దేనని కెటిఆర్ తెలిపారు.

మొదటి నుంచీ ఈ అంశానికి ప్రాధాన్యత ఇచ్చామని గుర్తుచేస్తూ సుప్రీంలో పదేళ్ల పాటు ఇంప్లీడ్ అయి ఈ అంశంలో గట్టిగా వాదించామని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు తీర్పు వస్తే వచ్చి ఉండొచ్చునని అన్నారు. ఈ ఎస్సీ వర్గీకరణ నివేదికను స్వాగతిస్తున్నామని తెలిపారు. కానీ బిసిల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నామని ప్రకటించి శాసనసభ నుంచి వెళ్లిపోయారు. కెటిఆర్ వ్యాఖ్యలు, బిఆర్‌ఎస్ పక్షం వాకౌట్‌లపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ తమ చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ విషయాలు చెప్పారు తప్పితే నివేదికపైనా, అమలుకు సంబంధించి ఎటువంటి సూచనలు చేయలేదని అన్నారు. ప్రతిపార్టీలో అందరికి అవకాశం ఉండదని, కొందరికి ఇస్తామన్నా వినకుండా వాకౌట్ చేశారని మంత్రి అన్నారు. బిఆర్‌ఎస్ ఆలోచన తీరును ప్రజలు గమనించాలని కోరారు.

స్వాగతించిన బిజెపి, సిపిఐ
ఎస్సీ వర్గీకరణ నివేదికకు బిజెపి సంపూర్ణ మద్దతు ఇస్తుందని, స్వాగతిస్తుందని బిజెపి శాసనసభ పక్ష ఉపనేత పాయల్ శంకర్ ప్రకటించారు. శాసనసభలో చర్చలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు. సుప్రీం తీర్పును పకడ్భందీగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. వర్గీకరణ పోరాటంలో అనేక సందర్భాల్లో కృష్ణమాదిగ పడిన ఇబ్బందులు, మోడీ కృషిని, సుప్రిం తీర్పుకన్నా ముందు జరిగిన విషయాలను ఆయన ప్రస్తావించారు.

బిసిలకు అన్యాయం జరిగిందని పాయల్ శంకర్ చెప్పడంతో బిసిల గురించి కాకుండా ఎస్సీ వర్గాకరణపై మాట్లాడాలని ప్యానల్ స్పీకర్ సూచించారు. బిసిలకు అవమానం జరగొద్దని విజ్ఞప్తి చేస్తున్నా, నాకు బిసిలపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదని శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ గతంలో ఎన్నో కమిషన్లు వేశారు, కానీ 2024 ఆగస్టులో సుప్రీం కోర్టు వర్గీకరణకు ఆదేశించడంతో ముందుకు కదిలిందని అన్నారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం క్యాబెనెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి షమీమ్ అక్తర్‌ను ఏకసభ్య కమిషన్ నియమించిందని అన్నారు. అయితే కమిషన్ రిపోర్టును ఎందుకు శాసనసభలో ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. దయ చేసి ఇప్పటికైనా శాసనసభ ముందు ఉంచాలని కోరారు.

ఇందుకు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ జ్యుడీషియల్ కమిషన్ రిపోర్టు ఎప్పుడు శాసనసభలో ప్రవేశ పెట్టలేదని వివరణ ఇచ్చారు. సిపిఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ శాశ్వతంగా పరిష్కారం ఈ రెండు అంశాలకు, మనస్ఫూర్తిగా సిపిఐ తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్ కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో తెచ్చారని గుర్తు చేస్తూ అందుకు తగిన నిధులు ఇవ్వడం లేదని అన్నారు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. పలువురు ఎమ్మెల్యేలు ప్రసంగిస్తూ ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News