Sunday, December 22, 2024

నిరుద్యోగులే ఫస్ట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 2వ తేదీన నోటిఫికేషన్ ఇ చ్చి డిసెంబర్ 9వ తేదీలోపు ఉద్యోగాలిచ్చేలా జాబ్ క్యాలండర్‌ను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలండర్ ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం మార్చిలోగా అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలు తెప్పించుకుంటామన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి యూపిఎస్సీ మె యిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులతో సిఎం శనివారం భే టీ అయ్యారు. అంతకుముందు హైదరాబాద్ ప్రజాభవన్‌లో సింగరేణి సంస్థ సహకారంతో ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని’ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో కలిసి సి ఎం ప్రారంభించారు. మంచి తరువాయి 6లో
కార్యక్రమాన్ని చేపట్టిన సింగరేణి సంస్థకు సిఎం రేవంత్ అభినందనలు తెలిపారు. అనంతరం సివిల్స్, ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో సిఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి, జూపల్లి, తుమ్మల, కోమటిరెడ్డి, సిఎస్ శాంతి కుమారి, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, సింగరేణి సిఎండి బలరాంలు పాల్గొన్నారు.

మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగానే….
ఈ కార్యక్రమంలో భాగంగా 2023 సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన 41 మందికి లక్ష చొప్పున ఆర్థికసాయం సిఎం అందించారు. నిరుద్యోగ యువతకు మేమున్నామన్న మనోధైర్యం కల్పించేందుకే మంత్రివర్గ సహచరులంతా ఇందులో పాల్గొన్నట్లు సిఎం వివరించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందుతుందని సిఎం తెలిపారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద లబ్ధి పొందాలనుకునే అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు, కుటుంబ వార్షిక ఆదాయం, మార్గదర్శకాలు, నిబంధనలను రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.

సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరఫున సాయం
అనంతరం సిఎం రేవంత్ మాట్లాడుతూ సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామని రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అభ్యర్థుల సమస్యలను సహృదయంతో అర్ధం చేసుకుని గ్రూప్-2 పరీక్ష వాయిదా వేశామని ముఖ్యమంత్రి వివరించారు. ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని సిఎం హమీ ఇచ్చారు. ప్రభుత్వంపై అభ్యర్థులకు నమ్మకం కలగాలని త్వరగా నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు కచ్చితంగా ఉద్యోగం సాధించాలని సిఎం రేవంత్ ఆకాంక్షించారు. సివిల్స్ సాధించి రాష్ట్రానికే రావాలని ఆయన అభ్యర్థులను కోరారు. ఐఏఎస్, ఐపిఎస్‌లు తెలంగాణవారైతే రాష్ట్రానికి ఇంకా మంచి జరుగుతుందన్నారు. పరీక్షలు మాటిమాటికి వాయిదా పడడం మంచిది కాదన్నారు.

అభ్యర్థుల సమస్యలను అర్ధం చేసుకొని గ్రూప్ -2 పరీక్ష వాయిదా
అభ్యర్థుల సమస్యలను అర్ధం చేసుకుని గ్రూప్ -2 పరీక్ష వాయిదా వేశామన్నారు. నిరుద్యోగుల బాధలు తమకు తెలుసనీ, దురదృష్టవశాత్తు కొన్నేళ్లుగా తెలంగాణలో యువత ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే దానికంటే పరీక్షల్లో జరిగే నిర్వహణ లోపాలపై కొట్లాడేందుకే వారి సమయం వృధా అయ్యిందన్నారు. ఉద్యోగ నియామకాల కోసమే రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నామని, విద్యార్థుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడిందని సిఎం రేవంత్ గుర్తు చేశారు. 90 రోజుల్లో 30 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినట్లు వివరించారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాలకు నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారని ఆయన తెలిపారు. యూపిఎస్సీ ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా వాటిపై ఆరోపణలు, నిర్వహణ లోపాలు ఏమీ లేవని అందుకే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక యూపిఎస్సీ చైర్మన్‌ను కలిశానని ఆయన తెలిపారు.

తెలంగాణ నుంచి ఏటా 50 వేల మంది సివిల్ ప్రిలిమినరీ పరీక్షలకు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పూర్తిగా పునర్ వ్యవస్థీకరించి, యూపిఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో కొన్ని మార్పులు చేసి వెనువెంటనే నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్లు ఆయన వివరించారు.‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పథకం ప్రయోజనాలు పొందడానికి అర్హతలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య దాదాపు 14 లక్షలు కాగా, సింగరేణి కాలరీస్ అంచనా ప్రకారం తెలంగాణ నుంచి ఏటా 50 వేల మంది సివిల్ ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తున్న వారి సంఖ్య 400 నుంచి 500 వరకు ఉంటుందని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది: డిప్యూటీ సిఎం
తెలంగాణ బిడ్డలు మేథస్సు కలిగినవారని, ఆకాశమే హద్దుగా దూసుకుపోతారని, వారికి కావాల్సింది ఆర్థిక ప్రోత్సాహం, ధైర్యమని, వారికి అది కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆ వ్యవస్థ తెలంగాణ ప్రభుత్వం మెయిన్స్‌కు ప్రిపేర్ కావడానికి ప్రభుత్వం పక్షాన ఆర్థిక సాయం అందించడం రాష్ట్ర చరిత్రలోనే ప్రథమం అన్నారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమన్నారు. అంతా మెయిన్స్‌కు ఎంపిక కావాలి. ఇంటర్వ్యూ క్లియర్ చేయాలని ఆశిస్తున్నానని డిప్యూటీ సిఎం తెలిపారు. మీకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని డిప్యూటీ సిఎం వారికి భరోసా ఇచ్చారు.

‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ మార్గదర్శకాలు ఇలా…
జనరల్ (ఈడబ్ల్యూఎస్ కోటా)/బిసి/ఎస్సీ/ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వారై ఉండాలి.
అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి.
యూపిఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వార్షిక కుటుంబ ఆదాయం రూ. 8 లక్షల లోపు మాత్రమే ఉండాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల శాశ్వత ఉద్యోగులు అనర్హులు.
గతంలో ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని పొంది ఉండకూడదు
అభ్యర్థులు వారి ప్రయత్నంలో ఒక్కసారి మాత్రమే ఈ ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News