Thursday, September 19, 2024

ఒలింపిక్స్‌లో మన ముద్ర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని ము ఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆకాంక్షించా రు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్పోర్ట్ యూనివర్సిటీపై ఆయన వారితో చర్చించారు. ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండి యా స్పోర్ట్ యూనివర్సిటీ ఏవిధంగా ఉండాలనే దానిపై పలు సూచనలు చేశారు. ఇందులో ప్రతి క్రీడకు ప్రాధాన్యం ఉండాలని, అన్ని రకాల క్రీడల ను, క్రీడా శిక్షణా సంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే స్పోర్ట్ యూనివర్సిటీ లక్షమన్నారు. మన దేశంతో పాటు తెలంగాణలోని భౌగోళిక పరిస్థితులు, మన శరీర నిర్మాణ తీరుకు అనువైన క్రీడలు ఏవో గుర్తించి, క్రీడలపై ఉత్సాహం ఉ న్న వారిని గుర్తించి వారిని ఆయా క్రీడల్లో వారిని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దశాబ్దాల క్రితమే ఆఫ్రో ఏషియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఆతిధ్యమిచ్చిన హైదరాబాద్‌ను భవిష్యత్తులో ఒలింపిక్స్‌కు వే దికగా మార్చాలని రేవంత్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహించడమే కాకుండా ప్ర తి క్రీడలో మన క్రీడాకారులకు పతకాలు దక్కేలా వారిని తీర్చిదిద్దాలని, అందులో మన స్పోర్ట్ యూనివర్సిటీ క్రీడాకారులు ఖచ్చితంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం వారికి నిపుణులైన శిక్షకులతో శిక్షణ ఇ ప్పించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోని క్రీడా విభాగాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్రీ డా పాఠశాలలు, అకాడమీలు, క్రీడా శిక్షణా సం స్థలన్నింటినీ స్పోర్ట్ యూనివర్సిటీ పరిధిలోకి తీ సుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. స్పోర్ట్ యూనివర్సిటీ మన దేశ క్రీ డాకారులు ఒలింపిక్స్‌లో రాణించే షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, ఆర్చరీ, జావెలిన్ త్రో, హాకీకి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తరువాత శిక్షణ ద్వారా పతకాలు సాధించే అవకాశాలు ఉన్న క్రీడల్లో శిక్షణ ఇప్పించాలని సూచించారు. యూనివర్సిటీలో ఆయా క్రీడల్లో శిక్షణకు అవసరమైన వ సతులు, ఆహారంతో,
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు.

ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో క్రీడా పాఠశాల : చిన్నతనంలోనే విద్యార్ధుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాలు, వారికి ఏ క్రీడలపై మక్కువ ఉందో ఉపాధ్యాయులు గుర్తించాలని ముఖ్యమంత్రి సూచించారు. అటువంటి విద్యార్ధులందరికీ ఆయా క్రీడల్లో శిక్షణ ఇచ్చేలా ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఒక స్పోర్ట్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. ఆ పాఠశాలల్లో విద్యా బోధన ఉంటుందని, అయితే క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. విద్యార్ధులకు అక్కడ వారికి నచ్చిన క్రీడల్లో శిక్షణ ఇచ్చి ప్రతిభ ఆధారంగా వారికి స్పోర్ట్ యూనివర్సిటీలో వసతి కల్పించి మరింత పదును తేలేలా శిక్షణ ఇప్పించాలన్నారు.
సమగ్ర అధ్యయనం చేయండి : హైదరాబాద్ లోని స్పోర్ట్ యూనివర్సిటీ దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా ఉండాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఇటీవల ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన దేశాలు, క్రీడాకారుల వివరాలను సేకరించి ఆయా క్రీడాకారులు పతకాల సాధనకు శ్రమించిన తీరు, ఆయా దేశాలు వారిని ప్రోత్సహించిన తీరు, వారికి ఇచ్చిన శిక్షణ, ప్రోత్సాహం తదితరాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా పేరు పెట్టామని, స్పోర్ట్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా పేరు ఖరారు చేసినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు యంగ్ ఇండియా పేరు పెడతామని ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణ యంగ్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. క్రీడా నైపుణ్యాల్లో తెలంగాణ ఒక శక్తి వంతమైన రాష్ట్రంగా గుర్తింపు పొందడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News