Friday, November 22, 2024

పర్యాటక క్షేత్రంగా దత్త ఆశ్రమం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: దుండిగల్‌లోని శ్రీ శ్రీశ్రీ దత్త సభా మండపాన్ని ప్రారభించడం ఆనందంగా ఉందని, సచ్చిదానంద- స్వామి ఆశీస్సులు మ న అందరిపై ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దుండిగల్‌లో నూతనంగా నిర్మించిన దత్త సభా మండపాన్ని ముఖ్య అతిధిగా పాల్గొని ఐటి శా ఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఒడుదుడుకులు మధ్య గణపతి సచ్చిదానంద ఆశ్రమాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం ఆనందంగా ఉందన్నారు.ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రతి ఏటా మైసూర్‌లో జరగాల్సిన దస రా ఉత్సవాలు తెలంగాణలో ప్రారంభించడం స్వా మి ఆశీర్వదామన్నారు.

ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అవదూత శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద ఆశీస్సులతో శ్రీశ్రీ దత్త విజయానంద ఆశీస్సులతో గణపతి సభా మండపాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. హిందూ సాం ప్రదాయం విలువలు యావత్ ప్రపాంచానికి చాటి చెప్పిన సచ్చిదానందస్వామీ నిర్ణయం ఎనలేనిదన్నారు. దత్త విజయానంద స్వామి మాట్లాడుతూ పెద్ద అపాయం వచ్చి అగ్నిదేవుడు తాండవించి ఆలయం బూడిదైన చెక్కు చెదరని ఆత్మ విసవ్వాసంతో దత్త సచ్చిదానంద ఆశీస్సులతో ఆలయాన్ని పునర్నిరించడం ఆనందంగా ఉందన్నారు. రేవంత్‌రెడ్డికి ఎన్ని పనులున్న ఆలయ ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల కృషి ఎనలేనిదన్నారు.దత్త సచ్చిదానంద స్వా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News