Monday, January 20, 2025

కార్పొరేట్‌కు ధీటుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ని రిజిస్ట్రార్ కార్యాలయాలను కార్పొరేట్ ఆఫీసులకు ధీటుగా తీర్చిదిద్దాలని ప్రభు త్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చాలావరకు అద్దె ఆఫీసుల్లోనే కొనసాగుతున్నాయి. చా లా ఏళ్లుగా ఇరుకు ఆఫీసుల్లో పనిచేయలేక అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాటి స్థానం లో కార్పొరేట్ కార్యాలయాలను తలదన్నే రీతిలో అధునాతన భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లకు వచ్చే వారు కూర్చోవడానికి కొన్నిచోట్ల కుర్చీలు లేకపోవడం తో చెట్ల కింద బయట వారు సర్దుకుపోతున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే వర కు కార్యాలయాల్లో వారు నిలబడాల్సిన ప రిస్థితి నెలకొంది.రానున్న రోజుల్లో అ లాం టి పరిస్థితి రాకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కార్పొరేట్ ఆఫీసులను తలదన్నేలా తీర్చిదిద్దాలని సిఎం ఆదేశించారు.

రాష్ట్రంలో మొత్తం 141 సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయాలుండగా వాటిలో 37 మాత్రమే సొంత భవనాల్లో నడుస్తుండగా ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకున్న ఆదిలాబాద్‌లో ని బోథ్,’ మేడ్చల్ జిల్లా శామీర్‌పేట సబ్ రి జిస్ట్రార్ ఆఫీసులను ఎన్నికల కోడ్ తర్వాత ప్రారంభించాలనిప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 104 ఆఫీసులు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. 52 చోట్ల కార్యాలయాలకు అవసరమయ్యే భవనాల నిర్మాణానికి ప్రభుత్వ భూమి కూడా కేటాయించారు. భూములు సిద్ధంగా ఉన్న చోట వీలైనంత త్వరగా మోడల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులను నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. మిగతా 52 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సరిపడా స్థలాలను అన్వేషించాలని, పబ్లిక్ యుటిలిటీ కింద సేకరించిన స్థలాలు అందుబాటులో ఉంటే అక్కడే నూతన భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు. మొదటి దశలో ఆదాయం ఎక్కువగా తెచ్చిపెడుతున్న రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల నిర్మాణాలకు ప్రాధాన్యమివ్వాలని ఆయన నిర్ణయించారు.

ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే చోట సిబ్బంది కొరత లేకుండా….
అక్కడికి వచ్చే క్రయ, విక్రయదారులు తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసేంత సేపు మంచి ఆతిథ్యమిచ్చే, ఆహ్లాదంగా ఉండే కార్పొరేట్ లుక్, వెయిటింగ్ హాల్, తాగునీటి సదుపాయం, కేఫ్‌టేరియా లాంటి అన్ని సదుపాయాలుండాలని సిఎం అధికారులకు సూచించారు. అవన్నీ ఉండేలా ఈ నిర్మాణాలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే చోట సిబ్బంది కొరత లేకుండా చూడాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఆదాయం తక్కువగా ఉన్న జిల్లాల ఆఫీసుల నుంచి ఎక్కువ పని ఉన్న చోటుకు సిబ్బందిని సర్దుబాటు చేయాలని కూడా ఆయన ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News