జమ్మూకాశ్మీర్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడి ఘటనపై సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ముష్కరుల చర్యను తీవ్రంగా ఖండి స్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన తెలిపారు. ఉగ్రవాద మూకల విష యంలో కఠినంగా వ్యవహారించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూ రాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఇప్పటి వరకు 27 మంది టూరిస్టులు మరణించగా మరో 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనను సిఎం రేవంత్ ఖండించారు.
జమ్మూకాశ్మీర్ ఘటనపై సిఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -