Friday, September 27, 2024

నైపుణ్య విప్లవం సృష్టిస్తాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 50లక్షల దాకా ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం నైపుణ్య విప్లవం తీసుకొస్తామని, ఈ వి ష యంలో దేశానికే ఆదర్శంగా ఉండాలన్నదే తమ లక్షమని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 35 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని, త్వరలోనే మరో 35 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని, రెండు, మూడు నెలల్లో ఈ భర్తీ పూర్తవుతుందని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. బుధవారం మాసబ్‌ట్యాంక్‌లో జేఎన్‌ఎఫ్‌ఏయూలో బిఎఫ్‌ఎస్‌ఐ (బ్యాకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్) రంగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ 10 సంవత్సరాల బిఆర్‌ఎస్ పాలనలో విద్యార్థులు, ని రుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని విద్యార్థులంతా రోడ్డున పడ్డార ని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యను గుర్తించామని, అన్ని శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టామని ఆయన తెలిపారు. నిరుద్యోగ తీవ్రతను గుర్తించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. వెబ్‌సైట్‌లో 30 లక్షల మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నారని, కానీ, రాష్ట్రంలో 50 నుంచి 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని ఆయన వెల్లడించారు. ఉద్యోగాల భర్తీని బాధ్యతగా తీసుకొని ఆచరణలో పెడుతున్నామని ఆయన పేర్కొన్నారు.

డ్రగ్స్‌తో భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రంలో నిరుద్యోగ స మస్య తీవ్రంగా ఉందని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తే నిరుద్యోగ సమ స్య మొత్తం తీరేదన్నారు. ప్రైవేటు సెక్టార్‌లో కూడా యువతకు ఉపాధి కల్పించడంపై దృష్టి పెట్టామన్నారు. ప్రస్తు తం పరిశ్రమలు, నిరుద్యోగులకు మధ్య గ్యాప్ ఉందని ఇండస్ట్రీ పెద్దలను పిలిచి వారి అవసరాలు తెలుసుకున్నామని, ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని ఆయన వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్శిటీ ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని ఆయన తెలిపారు. ఉద్యోగాల లేక ఒత్తిడిలో యువత డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు బానిస అవుతోందని డ్రగ్స్ బారిన పడి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు.

నాలెడ్జ్, కమ్యూనికేషన్ ఉంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయని, చదివిన డిగ్రీకి, మార్కెట్లో ఉన్న డిమాండ్‌కు గ్యాప్ ఉంటోందని సిఎం తెలిపారు. డిగ్రీ చదివేవారు భవిష్యత్ దిశగా ఆలోచించాలని ఆయన కోరారు. బిఎఫ్‌ఎస్‌ఐకు అవసరమైన స్కిల్స్ నేర్పేందుకు కోర్సు ప్రారంభిస్తున్నామని సిఎం చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్థులు స్కిల్స్ నేర్చుకోవడం లేదని, కొన్ని కళాశాలల్లో అధ్యాపకులు, వసతులు ఉండటం లేదని సిఎం ఆక్షేపించారు. కళాశాలలు ఇలాగే కొనసాగితే గుర్తింపు రద్దు చేసేందుకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్ అకాడమీ, యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఔత్సాహిక క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని ఆయన వివరించారు. బ్యాంకులు, బీమా రంగాల్లోనూ ఎక్కువ ఉద్యోగవకాశాలు ఉన్నాయని సిఎం తెలిపారు.

వన్ ట్రిలియన్ ఎకానమీ రాష్ట్రంగా నిలబెడుతాం
వృద్ధాప్య పింఛన్లు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదని సిఎం చెప్పారు. పింఛన్లు ఒకరు వెయ్యి ఇస్తే మరొకరు రెండు వేలు ఆ పై వచ్చే వారు నాలుగు వేలు ఇవ్వొచ్చని సిఎం అన్నారు. కల్యాణ లక్ష్మికి ఈ సారి లక్ష ఇస్తే వచ్చే సారి రెండు లక్షలు ఇవ్వొచ్చని సిఎం పేర్కొన్నారు. ఒకరు డబుల్ బెడ్ రూం అంటే ఇంకొకరు ఇందిరమ్మ ఇళ్లు అనొచ్చని, ఇదంతా పెద్ద ఇన్నోవేటివ్ థింకింగ్ ఏమీ కాదని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ సంక్షేమంలో భాగం మాత్రమేనని ఆయన తెలిపారు. కానీ, ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సింది వీటిపై కాదని యువతకు నైపుణ్యం కల్పించి,

ఉపాధి మార్గాలు పెంపొందించాల్సిన అవసరం ఉందని, ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుం దన్నారు. భారతదేశంలో తెలంగాణను రోల్ మోడల్ చేసే విషయంలో రాష్ట్ర యువతను తీర్చిదిద్దడంలో తమ ప్రభుత్వం అలుపెరగని కృషి చేస్తుం దని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ ఎకానమీ రాష్ట్రంగా నిలబెట్టే బాధ్యత తమది అన్నారు. రాబోయే నాలుగేళ్లలో రూ.3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ను రూ.7 లక్షల కోట్ల బడ్జెట్‌కు తీసుకుపోతామన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎక్విప్ సంస్థ రూ. 2.5 కోట్ల చెక్కును ముఖ్యమంత్రికి అందించగా విద్యార్థుల డేటాతో రూపొందించిన ఎక్విప్ స్కిల్ పోర్టల్ ను ముఖ్యమంత్రి ఈ వేదికపై ఆవిష్కరించారు.

ఆ రంగాల్లో ఐదు లక్షల ఉద్యోగాలు: శ్రీధర్‌బాబు
రానున్న రోజుల్లో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్స్యూరెన్స్ రంగాల్లో ఐదు లక్షల మంది శిక్షణ పొందిన అభ్యర్థుల అవసరం ఉంటుందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ ఖాళీల భర్తీకి నైపుణ్యం కలిగిన వారిని తయారు చేయగలిగితే రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ఆయన తెలిపారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏనాడు నిరుద్యోగ యువత ఆకాంక్షలను గుర్తించలేక పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యార్థులు, యువతకు ఉపాధి కల్పించడంపై దృష్టి సారించామని శ్రీధర్ బాబు తెలిపారు.

5-6 నెలల పాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా శ్రమించి ఈ శిక్షణ కోర్సుకు రూపకల్పన చేసిందని ఆయన వెల్లడించారు. తాను ఎక్విప్ అనే సాంకేతిక శిక్షణ అందించే సంస్థను సంప్రదించినప్పుడు వారు సానుకూలంగా స్పందించడం ఉత్సా హాన్నిచ్చిందని శ్రీధర్‌బాబు వెల్లడించారు. సామాజిక బాధ్యత కింద ఎక్విప్ రూ.2.5 కోట్ల వ్యయంతో ఏటా పదివేల మందికి ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి ముందు కొచ్చిందని ఆయన తెలిపారు. ఆరు నెలల పాటు క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ శిక్షణ పొందే అవకాశాన్ని కల్పించడానికి పలు బ్యాంకింగ్, ఫైనాన్స్ , ఇన్స్యూరెన్సు సంస్థలు సంసిద్ధత తెలిపాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News