Monday, January 27, 2025

ప్రజాపాలనలో పేదలకు పెద్దపీట

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు క్రిస్టియన్ మిషనరీలే స్ఫూర్తి
దళిత క్రైస్తవులకు త్వరలో ఇందిరమ్మ ఇళ్లు మెదక్ చర్చిలో
క్రిస్మస్ ప్రార్థ్ధనల సందర్భంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి
రేవంత్‌రెడ్డి రూ.29కోట్లతో చర్చి అభివృద్ధి పనులకు
శంకుస్థాపన చర్చి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సిఎం

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి: రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచే స్తూ ఇచ్చిన మాట ప్రకారం పేదల ఆ కాంక్షను నెరవేర్చే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం క్రిస్మస్ ప ర్వదినం, మెదక్‌లోని చారిత్రాక చర్చి శతాబ్ది వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చర్చి ఇన్‌ఛార్జి బి షప్ రెవరెండ్ రూ బెన్ మార్క్ జరిపిన ప్రత్యేక ప్రార్థనల్లో సిఎం పాల్గొని చర్చి నిర్మించిన చార్లెస్ వాకర్ పాస్నెట్ వారసులను కలిసి పలకరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ… త మ పరిపాలనలో రా ష్ట్రంలో ప్రతి ఒ క్కరు సుఖసంతోషాలతో ఉండేవిధంగా దేవుడు ఆత్మస్థైర్యాన్ని ఇ వ్వాలని కోరుకుంటూ క్రిస్మస్, నూతన సంవత్సర శు భాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో పేద ల ప్రభుత్వం కొనసాగుతోందని, ఉచి త విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రూ. 500 పంట బోనస్, రూ. 21 వేల కోట్ల రుణమాఫీలతోపాటు అన్ని సంక్షేమ ప థకాలు పేద ప్రజలకు అందుతున్నాయన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల ను కూడా దళిత క్రైస్తవులతోపాటు అ ర్హులైన పేదలకు అందజేస్తామని హా మీ ఇచ్చారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ముందుకు నడిపించేందుకు అందరి సహకారం ఉండాలని కోరుతూ, అభివృద్ధి విషయంలో ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని అన్నారు. మంత్రివర్గ సహాయ సహకారాలతో సమష్టి నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం ముందుకు కొనసాగుతోందన్నారు.

ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ప్రభుత్వం అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గేది లేదని, ప్రజల శ్రేయస్సే తమకు ముఖ్యమన్నారు. గత సంవత్సరం ఎన్నికలకు ముందు పిసిసి అద్యక్షుడి హోదాలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ చర్చికి వస్తానని మాట ఇచ్చి క్రిస్మస్ వేడుకతోపాటు శతాబ్ది ఉత్సవం రోజు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. గతంలో క్రిస్టియన్ మిషనరీలు విద్య, వైద్యంపై ఎంతో శ్రద్ద చూపించేవని, అదే తరహాలో తమ ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతో ముందుకు కొనసాగడానికి స్ఫూర్తిదాయకమన్నారు. వంద సంవత్సరాల క్రితం కరవు వచ్చినప్పుడు స్థానిక ప్రజలు ఆకలితో అలమటించినప్పుడు పనికి ఆహారం కల్పిస్తూ మెదక్ చర్చిని నిర్మించారని, ఆ గొప్ప ఆలోచన ఎంతోమంది కడుపునింపిందని, అదే తరహాలో తమ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. చర్చి నిర్మాణం జరిగిన వందేళ్లు గడిచినప్పటికీ ఎంతో కీర్తిప్రతిష్టలతో ప్రపంచంలోనే గొప్పదిగా నిలిచిందని కొనియాడారు.

తమ ప్రభుత్వానికి అందరి ఆశీర్వాదం ఉండి పది కాలాలపాటు కొనసాగాలని, మంత్రివర్గానికి ఏసుప్రభువు ఆశీస్సులు ఉండాలని కోరారు. అనంతరం చర్చి అభివృద్దికి రూ.29 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ పర్యాటక అభివృద్ధ్ది పనులకు సహచర మంత్రులైన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ, స్థానిక ఎంఎల్‌ఎ రోహిత్‌రావుతో కలిసి సిఎం శంకుస్థాపన చేశారు. అనంతరం చర్చి మతగురువులు ముఖ్యమంత్రిని ఘనంగా సత్కరించారు. తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో ఏడుపాయల వనదుర్గామాతను, మెదక్ సిఎస్‌ఐ చర్చిలను సందర్శించిన ఘనత సిఎం రేవంత్‌రెడ్డికి దక్కింది. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎంపిలు రఘునందన్‌రావు, సురేష్‌శెట్కార్, ఎంఎల్‌ఎలు లక్ష్మీకాంతారావు, సంజీవరెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ మైనంపల్లి హనుమంతరావు, చిలుముల మదన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్‌పి ఉదయ్‌కుమార్‌రెడ్డి, ప్రెసిబెటరీ ఇన్‌ఛార్జి శాంతయ్య, జాయ్‌ముర్రే, బానీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News