Thursday, September 19, 2024

చైనాను అధిగమించడానికే కొత్త పారిశ్రామిక విధానం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :అమెరికాకు సంబంధించిన వ్యాపార అవకాశాలన్నీ మన రాష్ట్రంలోనే ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న సంకల్పంతోనే నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురాబోతున్నామ ని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కొత్తగా పలు విధానాలను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేలా ఈ ఎంఎస్‌ఎంఈ పాలసీని తీసుకొచ్చామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి ఎంఎస్‌ఎంఈ పాలసీ ఎం తగానే దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. అందులో భాగంగా పారిశ్రామిక అభివృద్ధికి ఎంఎస్‌ఎంఈ పాలసీ, ఎగుమతి విధానం, కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ అనే కొత్త పాలసీలను ఖరారు చేయాలని గత సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సిఎం ఆదేశాలకు అనుగుణంగా అ ధికారులు ఈ పాలసీలను తయారుచేయడం తో బుధవారం ఎంఎస్‌ఎంఈ పాలసీని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మాదాపూర్ శిల్పకళా వేదికగా ‘ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024’ను సిఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించగా ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖకు సం బంధించిన 22 అసోసియేషన్స్ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.

కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు
ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా మా ర్పులు వచ్చాయని ఆయన తెలిపారు. చైనాతో పాటు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని వ్యాపార వేత్తలు భావిస్తున్నారన్నారు. తెలంగా ణ వడ్డించిన విస్తరి లాంటిదని, పెట్టుబడులకు అనుకూ లమైన ప్రాంతమని ఆయన పేర్కొన్నా రు. పెట్టుబడులు పెట్టేందుకు చైనా తర్వాత తెలంగాణానే బెస్ట్ ప్లేస్ అని ఆయన తెలిపారు. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకే ఎంఎస్‌ఎంఈ పాలసీని తీసుకొచ్చామ ని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమల కోసమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్కిల్ యూనివర్సిటీలో పరిశ్రమలకు ఉపయోగపడే కోర్సులు పెడతామన్నారు. తద్వారా గ్రామాల్లో ఉండే యువతకు ఉపాధి కల్పిస్తామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతియేటా లక్ష మంది ఇంజనీ ర్లు బయటకు వస్తున్నారని, ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చి పరిశ్రమలకు ఉపయోగపడేలా చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

స్కిల్ యూనివర్సిటీలో పరిశ్రమలకు ఉపయోగపడే కోర్సులు
పరిశ్రమల కోసమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ లో పరిశ్రమలకు ఉపయోగపడే కోర్సులు పెడతామన్నారు. తద్వారా గ్రామాల్లో ఉండే యువతకు ఉపాధి కల్పిస్తామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతియేటా లక్ష మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారన్నారు. ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చి పరిశ్రమలకు ఉపయోగపడేలా చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు వ్యవసాయం పురోగతి సాధించేలా చర్యలు చేపట్టామని, అగ్రికల్చరే తమ కల్చర్ అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యవసాయం దండుగ కాదు, పండుగ అన్నది ప్రభుత్వ విధాన్నమని సిఎం రేవంత్ తెలిపారు. రూ. 2లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేశామన్నారు. కుటుంబంలో కొందరు వ్యవసాయం మీద ఆధారపడాలని, మిగతా వారు విభిన్నర రంగాల్లో ఎదగాలని సిఎం రేవంత్ సూచించారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

పరిశ్రమలకు ఇవ్వాల్సిన సబ్సిడీలను చెల్లిస్తాం
ప్రపంచంతో పోటీ పడేలా నాటి ప్రధాని పివి నరసింహారావు దేశంలో ఆర్థిక విధానాలను తీసుకొచ్చారని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు చేసిన కృషిని ఎవరూ మరువలేరన్నారు. విధానపరమైన రూపకల్పనలు లేకుండా రాష్ట్ర అభివృద్ధి చెందిందని సిఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వం విధానాలను కొనసాగించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలకు ఇవ్వాల్సిన సబ్సిడీలను చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పాలకులు మారినా విధానాలు మాత్రం కొనసాగుతూ ఉంటాయన్నారు. 1994- నుంచి 2004 మధ్య కాలంలో చంద్రబాబు ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చారని ఆయన గుర్తు చేశారు. 2004 తరువాత కూడా మాజీ సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాటిని కొనసాగించారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. మంచి పనులు ఎవరు చేసినా వాటిని కొనసాగిస్తామన్నారు. సమగ్ర అధ్యయనంతో ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ఉంటుందన్నారు. అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రపంచంతో పోటీ పడేందుకు కొత్తగా ఫ్యూచర్ సిటీ
తెలంగాణ ప్రపంచంతో పోటీ పడేందుకు కొత్తగా ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే మూసీనది ప్రక్షాళన చేపట్టామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. మూసీ అంటే మురికి కూపం కాదని త్వరలోనే నిరూపిస్తామన్నారు. ప్రపంచ పర్యాటకులు మూసీని వచ్చి చూసేలా తయారు చేస్తామని, అమెరికా, లండన్ మాదిరిగా నదిని తీర్చిదిద్దుతామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఒకప్పుడు కృష్ణా జిల్లాలో ఎకరం అమ్మితే హైదరాబాద్‌లో ఎకరాలకు ఎకరాలు కొనేవాళ్లని ఆయన గుర్తు చేశారు. నేడు ఆ పరిస్థితి లేదని, ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఎపిలో 100 ఎకరాలు కొనవచ్చని ఆయన పేర్కొన్నారు.
అగ్రికల్చరే తమ కల్చర్
రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉందని, రైతుల అభ్యున్నతి దృష్టిని పెట్టుకునే వారికి రూ.2 లక్షల రుణమాఫీ చేశామని ఆయన స్పష్టం చేశారు. అయినా రైతుల కష్టాలు తీరడం లేదన్నారు. ఒక కుటుంబంలో అంతా వ్యవసాయానికే పరిమితం కావొద్దని, ఆ పని కొనసాగిస్తూనే ఇతర రంగాలపై దృష్టి సారించాలని సిఎం సూచించారు. అగ్రికల్చర్ ఇజ్ అవర్ కల్చర్ అని ఆయన అన్నారు.

నూతన విధానంలో రాయితీలు, భూ కేటాయింపులు, మహిళా కోటా: డిప్యూటీ సిఎం
ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే అద్భుతమైన ఎంఎస్‌ఎంఈ పాలసీ మనది అని ఆయన అన్నారు. ఇంత వరకు పరిశ్రమల పాలసీనే ఉండేదని కానీ, ఇప్పుడు ఎంఎస్‌ఎంఈ పాలసీ కూడా మనం తెచ్చుకున్నామని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ గతంలో ఎంఎస్‌ఎంఈ విధానం గురించి పారిశ్రామిక వేత్తలతో చర్చించారని, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా సిఎం రేవంత్ కొత్త పాలసీని తీసుకొచ్చారన్నారు. మల్టీ నేషనల్ కంపెనీలను సిఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి తీసుకు వస్తున్నారని, నూతన ఎంఎస్‌ఎంఈ విధానంలో రాయితీలు, భూ కేటాయింపులు, మహిళా కోటాలను చేర్చామని ఆయన తెలిపారు. సిఎం కృషిని అభినందిస్తున్నానని భట్టి పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాయితీలు ఇచ్చినట్టు గొప్పలు చెప్పిందని, కానీ, పరిశ్రమల యజమానులకు పైసా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిక భారీ పరిశ్రమలతో పాటు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు కూడా చాలా అవసరమని ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.

వన్ ట్రిలియన్ ఎకానమీ చేరుకోవాలన్నదే సిఎం లక్షం: మంత్రి శ్రీధర్‌బాబు
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఎంఎస్‌ఎంఈల పాలసీని విడుదల చేస్తున్నామని, దీని ద్వారా తమ లక్ష్యం, తమ ఆలోచన, తమ దృక్పథాన్ని రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మన రాష్ట్రం వన్ ట్రిలియన్ ఎకానమీ చేరుకోవాలని సిఎం సంకల్పించా రన్నారు. నిరుద్యోగులకు ఎక్కువ స్థాయిలో ఉపాధి కల్పిస్తున్న రంగం ఎంఎస్‌ఎంఈలని వాటిని కాపాడుకోవాలని తమ నాయకుడు రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారన్నారు. రాబోయే రోజుల్లో ఎంఎస్‌ఎంఈ అభివృద్ధిలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకో వాలన్నారు. పెద్ద పరిశ్రమలే కాదు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు అభివృద్ధి చెందాలన్నారు. పరిశ్రమల సంఘాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నూతన పాలసీని తీసుకువచ్చామని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News