Sunday, December 22, 2024

రైతులను ఇబ్బంది పెట్టొద్దు.. వ్యాపారులకు సీఎం రేవంత్‌ వార్నింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు. పంటల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై అవసరమైతే ఎస్మా కింద చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు.అన్ని జిల్లాల కలెక్టర్లు ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇబ్బందులుంటే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు.

కాగా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రభుత్వం ధాన్యం కొంటలేదని అధికారులు వాపోతున్నారు. ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలకు తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా అధికారులు కొనట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు సర్కార్ పై తీవ్రంగా మండుతున్నాయి. రైతులు పండించిన పంటను కొనే దిక్కు లేదని, సిఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News