Monday, December 23, 2024

వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై శుక్రవారం సాయంత్రం సమీక్ష జరిగింది. ఈ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడానికి ఉన్న ఆటంకాలు ఏమిటని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్‌ఈసీ) నూతన ఓటర్ల జాబితా రావాల్సి ఉందని అధికారులు సిఎం రేవంత్‌తో తెలిపారు.

అందుకు ఎంత సమయం పడుతుందని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు ఈసీఐ జాబితా పంపిందని, మనతో పాటు మరో ఆరు రాష్ట్రాలకు మరో వారంలో జాబితాలు పంపిస్తుందని అధికారులు సమాధానమిచ్చారు. జాబితా రాగానే వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వారంలోగా ఆయా స్థానిక సంస్థలకు తగినట్లు ఓట్లర్ల జాబితాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రిజర్వేషన్లకు సంబంధించి బిసి కమిషన్ సైతం నిర్దిష్ట గడువులోగా తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News