Thursday, January 23, 2025

నేడు సిఎం మూసీ యాత్ర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నే డు యాదగిరిగుట్టకు కుటుంబ స మేతంగా రానున్నారు. ఆయన పు ట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్టలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్టకు రా నున్న సిఎం రేవంత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఏర్పాట్లను పూర్తి చేశారు. సిఎం పర్యటన విజయవంతంగా సాగేందుకు అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పా ట్లు పూర్తి చేసింది.

మూసీ నది వెంట పాదయాత్ర
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి పర్యటన అనంతరం సిఎం రేవంత్ రెడ్డి మూసీనది పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేపడతారు. జిల్లాలోని వలిగొండ మండల సంగెం గ్రామ శివారులోని భీమలింగం క త్వ నుంచి మూసీ నది వెంట పాదయాత్ర నిర్వహిస్తారు. భువనగిరి మండలం మీదుగా బొల్లెపల్లి నుంచి వలిగొండ మండలం సంగెం సమీపంలోని భీమలింగం కత్వ వద్ద చే రుకుంటారు. భీమలింగం, ధర్మారె డ్డి కాల్వల్ని సందర్శిస్తారు.అనంత రం మూసీ పరీవాహక ప్రాంత రైతులతో సమావేశం అవుతారు. ప్రభు త్వం మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో మూసీ నది వెంట సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రా ధాన్యత సంతరించుకుంది.

సిఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర ఏర్పాట్లను వలిగొండ మండలం సంగెం భీమలింగం కత్వ వద్ద మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ అయిలయ్య, భువనగిరి ఎంఎల్‌ఎ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రాచకొండ సిపి సుధీ ర్ బాబు, కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి కలిసి గురువారం పరిశీలించారు. యాదగిరిగుట్టలోని వైటిడిఎ గెస్ట్ హౌస్‌లో యాదాద్రి కలెక్టర్ సమీక్ష సమావేశం ని ర్వహించారు. ఆల య ఈఓ భాస్కరరావు జిల్లా అధికారులతో ఆలయ పరిసరాలను కలెక్టర్, సిఎం సెక్యూరిటీ అధికారులు భద్రతాపరమైన ఏర్పాట్లను పరిశీలించారు. పాదయాత్ర వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, రైతులతో నేరుగా సిఎం రేవంత్ రెడ్డి చర్చించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రెండో సారి యాదాద్రికి సిఎం
రేవంత్ రెడ్డి సిఎం హోదాలో రెండోసారి యాదగిరిగుట్ట క్షేత్రానికి రానున్నారు. మొదటగా మార్చి 11వ తేదీన యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం రోజున క్షేత్రాన్ని మంత్రులతో కలిసి దర్శించారు. తిరిగి తన జన్మదిన సందర్భంగా ఈనెల 8వ తేదీన యాదగిరిగుట్ట క్షేత్రాన్ని సందర్శించనున్నారు. సిఎం హోదాలో ఆయన మొదటిసారి పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

పాదయాత్ర పనులను పరిశీలించిన మంత్రులు
సిఎం రేవంత్ రెడ్డి చేపట్టబోయే మూసీ పాదయాత్ర ఏర్పాట్లను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో ఉన్న మూసీ నది రానురాను మురికి కూపంగా మారిపోయిందని, గడచిన 42 సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలలో పనిచేసిన అనుభవం తనకుందని, మూసీ ప్రక్షాళనకు అన్ని ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది సాహసోపేతమైన చర్య అని అన్నారు. సాగునీటితో పాటు, తాగునీరు అందించడమే కాకుండా, మూసీ పరివాహక ప్రాంతంలోని లక్షలాది పేద ప్రజల జీవన పరిస్థితులను మార్చేందుకు తమ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేపట్టనున్నదని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ఇది కష్టమైనప్పటికీ, ఇబ్బంది అయినప్పటికి ఖచ్చితంగా మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని అన్నారు. మూసీ పరివాహక రైతులు, ప్రజలు, కులవృత్తుల ఈతి బాధలను ప్రత్యక్షంగా తెలుసుకొని వారికి మేలు చేసేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి తన జన్మదినం రోజు మూసి పాదయాత్ర చేపట్టనున్నారని, ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు మూసినది లక్షలాది మందికి సాగు, తాగునీరు ఇచ్చిందని, అలాంటిది ఈరోజు మూసీ వెంట నడవలేని పరిస్థితి ఉందని, దుర్గంధంతో ఉన్న మూసీ నదిని శుద్దీకరణ తర్వాత సాగునీటిని, తాగునీటిని అందించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. మేనిఫెస్టోలో ఈ విషయాలు తాము పొందుపరచనప్పటికి రాష్ట్ర ముఖ్యమంత్రి తన పుట్టినరోజున మూసీ నది వెంట పాదయాత్ర చేసి మూసీని శుద్ధీకరణ చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు కృషి చేస్తున్నారని అన్నారు .

దీని ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా తో పాటు, రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని, అందుకే మూసీ నది శాశ్వత పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరు మీద 50 వేల కోట్ల రూపాయలు, కాలేశ్వరం పేరు మీద లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని ,కానీ మురికి కూపంగా మారిన మూసీ నది మాత్రం గుర్తుకు రాలేదని అన్నారు. ఈకార్యక్రమంలో డిఆర్‌డిఎ నాగిరెడ్డి, డిపిఓ సునంద రోడ్లు భవనాల శాఖ నల్గొండ జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ సత్యనారాయణ రెడ్డి, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News