Monday, December 23, 2024

మతోన్మాదం సహించం: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రాభివృద్ధిలో పోలీసులది కీలకపాత్ర 
శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు,నేరాల అదుపులో తెలంగాణ దేశానికే ఆదర్శం 
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో సిఎం

మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయ ఘటనపై సిఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం గోషామహల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పోలీసు అమరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాన్ని ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ మతోన్మాద శక్తులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ముత్యాలమ్మ దేవాలయంలో జరిగిన సంఘటనలో నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తామన్నా రు. కొంతమంది వ్యక్తులు కావాలనే హైదరాబాద్‌లో అలజడి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు సం యమనం పాటించాలని కోరారు. మతోన్మాద శక్తులను క్షించాలని అధికారులను ఆదేశిస్తున్నానన్నారు. శాంతి భద్రతలు తమ చేతిల్లోకి తీసుకునే వారి పట్ల కఠినంగా ఉండాలని ఆదేశిం చారు. వివిధ మతాల పండుగలకు పోలీసులు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారని వెల్లడించారు. శాం తిభద్రతలు కాపాడేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని వెల్లడించారు.
పోలీసులు సమాజానికి రోల్ మోడల్స్
పోలీసులు సమాజానికి రోల్ మోడల్స్ అన్నారు. పోలీసులు ఎవరి ఎదుట చేయి చాపకూడదన్నారు. హుందాగా, గౌరవంగా బతుకుదామన్నారు. పోలీస్‌శాఖను ప్రతిపక్షాలు గమనిస్తుంటాయన్నారు. పో లీస్ సమస్యలు ఏమున్నా తన దగ్గరికి తీసుకువస్తే తాను పరిష్కరిస్తానని వెల్లడించారు. 140 కోట్ల దేశ జనాభా ప్రశాంతంగా ఉంటున్నారంటే అందుకు పోలీసులే కార ణం అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలంటే పోలీసులు కీలకం అని తెలిపారు. నిరుద్యోగుల సమస్య, శాంతి భద్రత లేని రాష్ట్రం ఉంటే పెట్టుబడులు రావన్నారు. రాష్ట్రం అభివృద్ధికి పోలీసుల నిరంతరం శ్రమిస్తున్నందుకు పోలీసులకు అభినందనలు అన్నారు. తీవ్రవాదులు మావోయిస్టు చేతులో మరణించిన అధికారులను స్మరించుకోవడం అంద రికి స్ఫూర్తిదాయకమన్నారు. కొత్త కొత్త పంధాల్లో నేరాలు జరుగుతున్నాయని, అన్ని రకాల నేరగాళ్ళను అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుం దన్నారు.

నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శం
‘తెలంగాణ పోలీసుల విధానాలను ఇతర రాష్ట్రాలు పాటిస్తున్నాయి. మన ఫోరెన్సిక్ ల్యాబ్ అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మన సైబర్ క్రైమ్ విభాగం దేశంలోనే గొప్పదని కేంద్ర హోంశాఖ అభినందించింది. ఇవాళ డ్రగ్స్ మహమ్మారి యువతను పట్టి పీడిస్తోంది. నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. చదువుకున్నవారు సైబర్ క్రైమ్ బాధితులుగా మారుతున్నారు.

సైబర్ క్రైమ్, డ్రగ్స్ మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ విషయంలో విపత్కర పరిస్థితి ఎదుర్కోంటోంది. మన రాష్ట్రంలో డ్రగ్స్ ఉత్పత్తి చాలా తక్కువ. డ్రగ్స్ వినియోగం మాత్రం ఇక్కడ క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్‌లో డ్రగ్స్ విరివిగా రవాణా పెరిగిపోయిందని, యువకులను మత్తు వైపు ముఠాలు నడిపిస్తున్నాయి. డ్రగ్స్ అరికట్టేందుకు టిజి న్యాబ్ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాం. డిజి స్థాయి అధికారిని నియమించాం. డ్రగ్స్ నివారణకు సరికొత్త చర్యలు తీసుకుంటున్నాం. నేరగాళ్లను కఠినంగా శిక్షించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ఎప్పుడూ ముందుంటాం’ అని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ నార్కొటిక్ బ్యూరో అద్భుతంగా పనిచేస్తోంది
గత 10 ఏండ్లలో రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల సరఫరా విపరీతంగా పెరిగిందని, దానిని అరికట్టడంలో తెలంగాణ నార్కోటిక్ బ్యూర్ అద్భుతంగా పనిచేస్తోందని అన్నారు. మన పోలీసుల పని తీరు దేశంలోని ఇతర రాష్ట్రాల పోలీసులకు స్ఫూర్తిగా నిలుస్తోందని చెప్పారు. అందుకే పక్క రాష్ట్రాల పోలీసులు కూడా తెలంగాణకు వచ్చి శిక్షణ పొం దుతూ వారి నైపుణ్యాన్ని పెంచుకుంటున్నారని, తీవ్రవాద, ఉగ్రవాద చర్యలను నియం త్రిం చడంతో మన రాష్ట్ర ఎస్‌ఐబి, గ్రే హోండ్స్, ఇతర పోలీసు విభాగాల నైపుణ్యా న్ని పక్క రాష్ట్రాల్లో కూడా ఫాలో అవుతున్నారన్నారు. మన ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే రిపోర్ట్ల్ ఆధారాంగా అనేక కేసులలో సిఎం తెలంగాణ పోలీసు వ్యవస్థపై ప్రశంసల వర్షం కురిపించారు.
అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో ట్రాఫిక్ నియంత్రణ
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు అర్టిఫిషియల్ ఇంటిజెన్స్‌ను ఉపయోగించాలని సూచించారు. దీని కోసం అవసర మయ్యే సాంకేతిక పరిజ్ఞానం,సదుపాయాలను అందించేందు కు ప్రభుత్వం రెడీగా ఉందన్నారు. ట్రా ఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపై చట్ట ప రంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రజలతోనే ఉండాలి.. క్రిమినల్స్‌తో కాదు
ఖద్దర్, ఖాకీల విధులను సమాజం ఎప్పుడు నిశితంగా గమనిస్తుందని, అందుకే వారందరీకి ఆదర్శంగా ఉండేలా మనం పని చేద్దామని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం పోలీసులకు ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. విధి నిర్వహణలో పోలీసులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని మాటిచ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రజలతోనే ఉండాలి తప్ప క్రిమినల్స్ తో కాదని, తప్పు చేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, అలాగే బాధితులకు సహానంతో, ఓపికతో సహకరించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News